మాజీ గర్ల్ ఫ్రెండ్ పర్సనల్ ఫోటోలు, వీడియోలకు రేట్ ఫిక్స్ చేసిన ప్రియుడు !
బెంగళూరు/బీదర్: కర్ణాటకలోని బీదర్ నగరంలోని ఓ కళాశాలలో (college) పీయూసీ చదువుతున్న యువతి (girlfriend) పరిచయం ఉన్న ఓ యువకుడి వేధింపులతో విసిగిపోయి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె ఆత్మహత్యకు చిటగుప్ప తాలూకాకు చెందిన అంబరీష్ రాజప్ప అలియాస్ అంబరీష్ (23) అనే యువకుడే కారణం అని బాదితురాలి (girlfriend) తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి తల్లి పోలీసులకు (college) ఫిర్యాదు చేయడంతో పోలీసులు అంబరీష్ ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.గత ఐదు ఆరు నెలలుగా తన కూతురి (girlfriend) మొబైల్ ఫోన్ కు కాల్ చేస్తున్న అంబరీష్ డబ్బుల కోసం ఆమెను వేధిస్తున్నాడని యువతి తల్లి పోలీసులకు చెప్పింది. డబ్బులు ఇవ్వకుంటే యువతి (girlfriend) అశ్లీల ఫోటోలు, వీడియో, ఆడియో సంభాషణలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని అంబరీష్ బెదిరించేవాడని యువతి తల్లి పోలీసులకు చెప్పింది.

కొన్నిసార్లు అంబరీష్ చేష్టలకు భయపడి ఇప్పటి వరకు రూ 25 వేలు ఒకసారి, రూ 30 వేలు ఒకసారి గూగుల్ పే ద్వారా అంబరీష్ కు ఇచ్చిందని, అయినా నిందితుడు ఆమెను (college) టార్చర్ పెట్టాడని బాధితురాలు (girlfriend)తల్లి పోలీసుల ముందు విలపించింది. ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించాలని ఈనెల 13వ తేదీ ఒకసారి, 17వ తేదీ మరోసారి ఫోన్ చేసిన అంబరీష్ బెదిరించాడని, డబ్బులు ఇస్తేనే ఆడియో, ఫోటోలు, వీడియోలు డిలీట్ చేస్తానని బెదిరించాడని బాధితురాలి (girlfriend) తల్లి ఆరోపించింది.
అంబరీష్ పదేపదే బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఏం చెయ్యాలో తెలీక తన కుమార్తె (girlfriend) ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కాలేజ్ అమ్మాయి (girlfriend) తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అంబరీష్ టార్చర్ కారణంగా తన కుమార్తె (college) విసిగివేసారి ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది.
మృతురాలి (girlfriend) తల్లి ఇచ్చిన మరో లేఖలో ఆ యువకుడిపై ఫిర్యాదు చేసినా అంతకుముందు తన కుమార్తె (college) మరణానికి కారణమైన ఎస్‌ఐ పట్టించుకోకుండా , కేసు నమోదు చెయ్యకుండా, కనీసం అంబరీష్ ను పిలిచి విచారణ చెయ్యకుండా తనను వెనక్కి పంపారని, దీనిపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సీరియస్ గా విచారణ జరిపి నిర్లక్ష్యం చేసిన ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని బాధితురాలు తల్లి డిమాండ్ చేస్తోంది.

కొన్ని నెలల క్రితం వరకు ఇంటర్ కాలేజ్ (girlfriend)అమ్మాయి, అంబరీష్ స్నేహితులుగా ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తరువాత అంబరీష్ పిలిచిన చోటకు అతని బైక్ లో కాలేజ్ అమ్మాయి (girlfriend) వెళ్లిందని, ఆ సందర్బంలో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో అంబరీష్ సీక్రేట్ గా వీడియోలు, ఫోటోలు తీశాడని పోలీసులు అంటున్నారు.
అంతే కుండా కాలేజ్ (girlfriend) అమ్మాయి రొమాన్స్ గా మాట్లాడిన సమయంలో అంబరీష్ సీక్రేట్ గా ఆమె మాటలను రికార్డు చేశాడని, తరువాత కాలేజ్ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అంబరీష్ మొబైల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు దానిని పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications