Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: రూమ్ లో పర్సనల్ ఫోటోలు, వీడియో తీసిన ప్రియుడు, మాజీ లవర్ అయ్యిందని ?, కారం పొడి !

బెంగళూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాలు ప్రతిరోజూ కలుస్తున్న యువతి, యువకుడు ఆఫీసు పూర్తి అయిన తరువాత బయట తిరిగారు. తరువాత ప్రేమించిన అమ్మాయితో అతను ఏకాంతంగా గడిపాడు. ఇలా చాలా కాలం ప్రేమికులు ఎంజాయ్ చేశారు. ఏకాంతంగా ప్రియురాలితో కలిసి ఉన్న సమయంలో ప్రియుడు అతని మొబైల్ ఫోన్ లో ఆమె అశ్లీల ఫోటోలు, వీడియోలు తీసిపెట్టుకున్నాడు. కొంతకాలం తరువాత ప్రియుడి తీరుతో విసిగిపోయిన ప్రియురాలు అతనికి దూరం అయ్యింది. అప్పటి నుంచి ప్రియుడు నీ నగ్న ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకుండా ఉండాంటే నేను అడిగినంత డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు. మాజీ ప్రియురాలి దగ్గర ఇష్టం వచ్చినట్లు డబ్బులు గుంజుకోవడం మొదలుపెట్టాడు. మాజీ ప్రియుడి తీరుతో విసిగిపోయిన అమ్మాయి ఆమెకు ఇటీవల సన్నిహితంగా ఉంటున్న యువకుడికి విషయం చెప్పింది. ఫ్రెండ్స్ తో కలిసి అర్దరాత్రి మాజీ ప్రియుడి ఇంటికి వెళ్లిన బాయ్ ఫ్రెండ్ అతని కళ్లలో కారం చల్లి దాడి చేసి అతని మొబైల్ ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు. తన మీద హత్యాయత్నం జరిగిందని పోలీసు కేసు పెట్టిన మాజీ ప్రియుడు అతని మాజీ ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అడ్డంగా బుక్కైపోయాడు.

 ఒకే కంపెనీలో ఉద్యోగం

ఒకే కంపెనీలో ఉద్యోగం

ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని సహకార నగర్ లో నివాసం ఉంటున్న సంతోష్ కుమార్ అలియాస్ సంతోష్ (23) బేకరి నిర్వహిస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం సహకార నగర్ లో నివాసం ఉంటున్న రమ్యశ్రీ (పేరు మార్చడం జరిగింది అనే యువతి సంతోష్ కు పరిచయం అయ్యింది. తరువాత సంతోష్, రమ్యశ్రీ ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకుంటున్నారు.

 రోజూ కలుసుకుంటున్న ప్రేమికులు

రోజూ కలుసుకుంటున్న ప్రేమికులు

రమ్యశ్రీ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. రమ్యశ్రీకి ఆఫీసు పూర్తి అయిన తరువాత సంతోష్ ఆమెను కలుస్తున్నాడు. తరువాత సంతోష్, రమ్యశ్రీ, ప్రేమించుకున్నారు. రమ్యశ్రీకి ఆఫీసు పూర్తి అయిన తరువాత సంతోష్ ఆమెతో బయట తిరిగాడు. తరువాత ప్రేమించిన అమ్మాయి రమ్యశ్రీతో సంతోష్ ఏకాంతంగా గడిపాడు. ఇలా చాలా కాలం ప్రేమికులు ఎంజాయ్ చేశారు.

 ప్రియుడు పక్కా కేటుగాడు

ప్రియుడు పక్కా కేటుగాడు

ఏకాంతంగా ప్రియురాలు రమ్యశ్రీతో కలిసి ఉన్న సమయంలో ఆమె ప్రియుడు సంతోష్ అతని మొబైల్ ఫోన్ లో ఆమె అశ్లీల ఫోటోలు, వీడియోలు తీసిపెట్టుకున్నాడు. చాలా కాలం నుంచి సంతోష్ అతని ప్రియురాలి నగ్న ఫోటోలు తీస్తూనే ఉన్నా ఆమె మాత్రం గుర్తించలేకపోయింది. కొంతకాలం తరువాత ప్రియుడు సంతోష్ తీరుతో విసిగిపోయిన ఆమె ప్రియురాలు రమ్యశ్రీ అతనికి దూరం అయ్యింది.

 ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేసిన మాజీ ప్రియుడు

ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేసిన మాజీ ప్రియుడు

ప్రియురాలు రమ్యశ్రీ దూరం అయినప్పటి నుంచి ఆమె మాజీ ప్రియుడు సంతోష్ రగిలిపోయాడు. నీ నగ్న ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకుండా ఉండాలంటే నేను అడిగినంత డబ్బులు ఇవ్వాలని సంతోష్ అతని మాజీ ప్రియురాలు రమ్యశ్రీని బ్లాక్ మెయిల్ చేశాడు. మాజీ ప్రియురాలు రమ్యశ్రీ దగ్గర ఇంతకాలం ఇష్టం వచ్చినట్లు డబ్బులు వసూలు చెయ్యడం మొదలుపెట్టాడు. మాజీ ప్రియుడు సంతోష్ తీరుతో విసిగిపోయిన రమ్యశ్రీ ఆమెకు ఇటీవల సన్నిహితంగా ఉంటున్న నంజుండస్వామి అనే యువకుడికి విషయం చెప్పింది.

 అర్దరాత్రి దాడి చేసిన ఫ్రెండ్స్

అర్దరాత్రి దాడి చేసిన ఫ్రెండ్స్

తన ప్రియురాలు రమ్యశ్రీని ఆమె మాజీ ప్రియుడు సంతోష్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ఎలాగైనా లాక్కోవాలని నంజుండస్వామి స్కెచ్ వేశాడు. స్నేహితులు ఆకాష్, ఎరిస్వామితో కలిసి నంజుండస్వామి సహకారనగర్ లోని సంతోష్ ఇంటి దగ్గరకు ఈనెల 16వ తేదీ అర్దరాత్రి 12.30 గంటల సమయంలో వెళ్లారు. ఆ సమయంలో సంతోష్ తో పాటు అతని స్నేహితుడు ధర్మేంద్ర దాస్ అక్కడే ఉన్నారు.

 కళ్లల్లో కారం పొడి చల్లి చితకబాదేశారు

కళ్లల్లో కారం పొడి చల్లి చితకబాదేశారు

సంతోష్, అతని స్నేహితుడు ధర్మేంద్ర దాస్ కళ్లల్లో కారం పొడి చల్లిన నంజుండస్వామి, ఎరిస్వామి, ఆకాష్ కర్రలు, రాడ్లు తీసుకుని ఇద్దరిని చితకబాదేశారు. తరువాత ఇద్దరి మొబైల్ ఫోన్స్ లాక్కొన్న నంజుండస్వామి అతని స్నేహితులు అక్కడి నుంచి పరారైనారు. తన మీద హత్యాయత్నం జరిగిందని సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 మాజీ ప్రియుడి మీద రివర్స్ కేసు

మాజీ ప్రియుడి మీద రివర్స్ కేసు

ఇదే సమయంలో తన నగ్న ఫోటోలు, వీడియోలు తీసి సంతోష్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు సంతోష్ మీద రివర్స్ కేసు పెట్టింది. బ్లాక్ మెయిల్ కేసులో సంతోష్ మీద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. నంజుండస్వామి దగ్గర ఉన్న సంతోష్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోకి ఫోటోలు, వీడియోలు పరిశీలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+