EX MLA: మాజీ ఎమ్మెల్యే మనుమడి భార్యకు ఉగ్రవాదులతో లింక్ ?, అరెస్టు, మేడమ్ లవ్ మ్యారేజ్, మతం మారి !
బెంగళూరు/ మంగళూరు: మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆ ప్రాంతంలో మంచి పేరు ఉంది. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉంటూ వ్యాపారాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీ అంటే ఓ హోదా ఉండేది. ఇదే సమయంలో ఎన్ఐఏ అధికారులు మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల్లో ఒకరి తరువాత ఒకర్ని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో లింక్ ఉందని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే మనుమడిని కొన్ని నెలల క్రితం అరెస్టు చేశారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మరో మనుమడి భార్యను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ హిందూ మతం మారిపోయి ఇస్లాం మతం స్వీకరించి మాజీ ఎమ్మెల్యే మనుమడిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీ
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఉళ్లాళ (మంగళూరు సమీపం) నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే ఇదినబ్బ ఫ్యామిలీకి ఆ ప్రాంతంలో మంచి పేరు ఉంది. మాజీ ఎమ్మెల్యే ఇదినబ్బ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉంటూ వ్యాపారాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఇదినబ్బ ఫ్యామిలీ అంటే ఓ హోదా ఉండేది. అయితే మాజీ ఎమ్మెల్యే ఇదినబ్బ మరణించిన తరువాత ఆ ఫ్యామిలీ స్టేటస్ కొంచెంకొంచెం తగ్గుతూ వచ్చింది.

మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన ఎన్ఐఏ
ఎన్ఐఏ అధికారులు ఉళ్లాళ మాజీ ఎమ్మెల్యే ఇదినబ్బ కుటుంబ సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఇదినబ్బ కుటుంబ సభ్యుల్లో ఒకరి తరువాత ఒకర్ని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో లింక్ ఉందని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే ఇదినబ్బ మనుమడు అబ్దుల్ రెహమాన్ ను 2021 ఆగస్టు 4వ తేదీన అరెస్టు చేశారు.

మరో మనుమడి భార్య
ఉళ్లాళ మాజీ ఎమ్మెల్యే కుమారుడు బిఎం. బాషాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. బిఎం. బాషా కొడుకు అబ్దుల్ రెహమాన్ ఐసిస్ ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్నాడని ఆరోపిస్తూ బిఎం. బాషా ఇంటిలో సోదాలు చేసిన ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే అబ్దుల్ రెహమాన్ ను అరెస్టు చేశారు. ఆ సమయంలో బిఎం. బాషా మరో కొడుకు అనాస్ భార్య దీప్తి అలియాస్ మరియం మీద కూడా ఎన్ఐఏ అధికారులకు అనుమానం వచ్చింది.

అప్పుడు వదిలేసి ఇప్పుడు అరెస్టు
మాజీ ఎమ్మెల్యే ఇదినబ్బ కొడుకు బిఎం. బాషా చిన్న కొడలు దీప్తి అలియాస్ దీప్తి మార్లా కూడా ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకుందని ఎన్ఐఏ అధికారులకు అనుమానం వచ్చింది. ఆ సమయంలో దీప్తి మార్లాకు చిన్న పాప ఉండటంతో అప్పట్లో ఆమెను అరెస్టు చెయ్యకుండా వదిలేశారు. సోమవారం దీప్తిని విచారణ చేసిన ఎన్ఐఏ అధికారులు ఆమెను అరెస్టు చేశారు.

మేడమ్ లవ్ మ్యారేజ్
కర్ణాటకలోని కొడుగుకు చెందిన దీప్తీ మర్లా 10 సంవత్సరాల క్రితం దేరళకట్టే కాలేజ్ లో చదువుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే ఇదినబ్బ మనుమడు అనాస్ ఆమెకు పరిచయం అయ్యాడు. తరువాత అనాస్, దీప్తి ప్రేమించుకున్నారు. హిందూ మతం మారిపోయిన దీప్తి ఇస్లాం మతం స్వీకరించి మాజీ ఎమ్మెల్యే మనుమడు అనాస్ ను లవ్ మ్యారేజ్ చేసుకుంది.
Recommended Video

కలకలం రేపింది
భర్త అనాస్ సోదరుడు అబ్దుల్ రెహమాన్ తో కలిసి దీప్తి మర్లా అలియాస్ మరియం కలిసి ఓ వర్గంలోని యువకును ఐసీస్ ఉగ్రవాదం వైపు ఆకర్షితులు అయ్యేలా చేస్తున్నారని, ఐసిస్ ఉగ్రవాదుల కోసం నిధులు సేకరించారని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక మాజీ ఎమ్మెల్యే ఇదినబ్బ కుటుంబ సభ్యులు ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్నారని వెలుగు చూడటం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications