EX Wife: బ్యాంకులో మాజీ భార్య సీటులో వేరే మహిళ, కత్తితో దారుణంగా పొడిచేసిన మాజీ భర్త, మాస్క్ !
తిరువనంతపురం/కోజికోడ్: బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న మహిళ కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. భర్తతో కలిసి జీవితాంతం సుఖంగా ఉండాలని ఆమె ఎన్నోకలలు కనింది. కట్టుకున్న భర్తతో వేరుగా కాపురం పెట్టింది. భార్య మంచి ఉద్యోగం చేస్తూ అంతే జీతం ఇంటికి తీసుకురావడంతో ఆమె భర్త మొదట జల్సా చేశాడని సమాచారం. రానురాను దంపతుల మద్య ఓ విషయంలో గొడవలు ఎక్కువ అయ్యాయి. రెండు సంవత్సరాల క్రితం దంపతులు విడిపోయారు. వేరుగా ఇల్లు తీసుకుని ఉంటున్న భార్య ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. బ్యాంకులో మాజీ భార్య ఏ సీటులో కుర్చుంటుందో ఆమె భర్తకు ముందు నుంచి తెలుసు. వివాహం చేసుకున్నప్పటి నుంచి బ్యాంకులో భార్య కుర్చునే సీటు మాత్రం మారలేదు. మాజీ భార్య మీద రగిలిపోయిన భర్త ఆమెను ఈ లోకంలో లేకుండా చెయ్యాలని, ఎలాగైనా చంపేయాలని స్కెచ్ వేశాడు. బయట భార్యను హత్య చెయ్యడం అతనికి సాధ్యం కాలేదు. బ్యాంకులోకి వెళ్లిన భర్త అతని మాజీ భార్య కుర్చునే సీటు దగ్గరకు వెళ్లాడు. అంతే కత్తి తీసుకుని ఒక్కసారిగా కుర్చీలో ఉన్న మహిళ మీద ఇష్టం వచ్చినట్లు కత్తితో పొడిచాడు. అంతే ఆమె గట్టిగా కేకలు వేసి ముఖానికి మాస్క్ తీసి కుప్పకూలిపోవడంతో మాజీ భర్త బిత్తరపోయాడు. తన భార్యకు బదులుగా ఆ సీటులో వేరే మహిళ కుర్చోవడం, ఆమెను కత్తితో దారుణంగా పొడిచేశానని అతను అయోమయానికి గురై పారిపోవడానికి ప్రయత్నించి చిక్కిపోయాడు. బ్యాంకు సిబ్బంది మహిళ మీద కత్తితో దాడి చేసిన అతన్ని చితకబాదేయడం కలకలం రేపింది.

బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న భార్య
కేరళలోని కోజికోడ్ లో బిజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కోజికో డ్ జిల్లాలోని కో ఆపరేటివ్ బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తున్న రంజిత (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ కుటుంబ సభ్యులు చూపించిన బిజును వివాహం చేసుకుంది. భర్త బిజుతో కలిసి జీవితాంతం సుఖంగా ఉండాలని రంజిత ఎన్నోకలలు కనింది. కట్టుకున్న భర్త బిజుతో రంజిత వేరుగా కాపురం పెట్టింది.

భార్య మీద అనుమానం
రంజిత మంచి ఉద్యోగం చేస్తూ అంతే జీతం ఇంటికి తీసుకురావడంతో ఆమె భర్త బిజు మొదట జల్సా చేశాడని సమాచారం. రానురాను బిజు, రంజిత దంపతుల మద్య ఓ విషయంలో గొడవలు ఎక్కువ అయ్యాయి. భార్య మీద బిజుకు అనుమానం ఎక్కువ కావడంతో గొడవలు ముదిరిపోయాయి. పెద్దలు నచ్చచెప్పినా బిజు ఏమాత్రం మారలేదు.

విడాకులు తీసుకున్న దంపతులు
రానురాను గొడవలు ఎక్కువ కావడంతో బిజు, రంజిత దంపతులు రెండు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని విడిపోయారు వేరుగా ఇల్లు తీసుకుని ఉంటున్న రంజిత ప్రతిరోజు బ్యాంకులో ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. బ్యాంకులో మాజీ భార్య రంజిత ఏ సీటులో కుర్చుంటుందో ఆమె మాజీ భర్త బిజుకు ముందు నుంచి తెలుసు. వివాహం చేసుకున్నప్పటి నుంచి బ్యాంకులో బిజు మాజీ భార్య రంజిత కుర్చునే సీటు మాత్రం మారలేదు.

సెలవులో ఉన్న మాజీ భార్య
మాజీ భార్య రంజిత మీద రగిలిపోయిన మాజీ భర్త బిజు ఆమెను ఈ లోకంలో లేకుండా చెయ్యాలని, ఎలాగైనా చంపేయాలని స్కెచ్ వేశాడు. బయట భార్య రంజితను హత్య చెయ్యడం బిజుకు సాధ్యం కాలేదు. బ్యాంకులోకి వెళ్లిన మాజీ భర్త బిజు అతని మాజీ భార్య కుర్చునే సీటు దగ్గరకు వెళ్లాడు. అయితే రంజిత ఆ రోజు సెలవులో ఉండటంతో ఆ సీటు వేరే మహిళ కుర్చుకుని పని చేస్తోంది. మాజీ భార్య సీటులో కుర్చున్న మహిళ ముఖానికి మాస్క్ వేసుకోవడంతో ఆ సీటులో కర్చుని ఉండేది తన మాజీ భార్య రంజిత అని బిజుపోరపాటు పడ్డాడు.

వేరే మహిళను కసకసా పొడిచేసిన మాజీ భర్త
బిజు అతని జోబులో ఉన్న కత్తి తీసుకుని ఒక్కసారిగా కుర్చీలో ఉన్న మహిళ మీద ఇష్టం వచ్చినట్లు కత్తితో పొడిచాడు. అంతే ఆమె గట్టిగా కేకలు వేసి ముఖానికి మాస్క్ తీసి కుప్పకూలిపోవడంతో మాజీ భర్త బిత్తరపోయాడు. తాను పొడించింది తన మాజీ భార్య రంజితను కాదని, అక్కడ వేరే మహిళ ఉందని తెలుసుకున్న బిజు బ్యాంకులో నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.
Recommended Video

చితకబాదేసిన బ్యాంకు సిబ్బంది
వేరే మహిళను తాను కత్తితో దారుణంగా పొడిచేశానని అయోమయానికి గురైన బిజు పారిపోవడానికి ప్రయత్నించి బ్యాంకు సిబ్బందికి చిక్కిపోయాడు. బ్యాంకు సిబ్బంది మహిళ మీద కత్తితో దాడి చేసిన బిజును చితకబాదేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని కోజికోడ్ మెడికల్ కాలేజ్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మాజీ భార్య మీద కసితో బిజు వేరే మహిళను హత్య చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. తాను సెలవు పెట్టి బతికిపోయానని, నా కారణంగా సాటి ఉద్యోగి ఆసుపత్రి పాలైయ్యిందని బిజు భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త బిజును చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, అతను బెయిల్ మీద బయటకు వస్తే కచ్చితంగా నన్ను చంపేస్తాడని అతని భార్య మరోసారి అతని మీద కోజీకోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంకో సారి కేసు పెట్టింది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications