Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంచం, టీవీ స్టాండ్ వెనుక సీక్రెట్ రూమ్స్: హైటెక్ వ్యభిచారం, ఎస్కేప్ బాబు ప్లాన్స్, చివరికి!

బెంగళూరు/మైసూరు: హైటెక్ వ్యభిచార కేంద్రాలు నిర్వహించడంలో ఆరితేరిన కింగ్ పిన్ ఎస్కేప్ బాబు అలియాస్ ఎస్టేట్ బాబును మైసూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు ఎత్తులకు పైఎత్తులు ఎసి ఎప్పటికప్పుడు పక్కాప్లాన్ లతో రహస్యంగా హైటెక్ వ్యభిచార కేంద్రాలు నిర్వహించే ఎస్టేట్ బాబు అలియాస్ ఎస్కేప్ బాబు కోసం చాల కాలంగా పోలీసులు గాలిస్తున్నారు. చివరికి ఎస్కేప్ బాబును అరెస్టు చేసిన పోలీసులు అనేక మంది అమాయక యువతులను రక్షించారు.

హైటెక్ ఇండ్లు

హైటెక్ ఇండ్లు

మైసూరు నగరం పరిసర ప్రాంతాల్లో హైటెక్ ఇండ్లు నిర్మిస్తున్న ఎస్కేప్ బాబు వాటిని తన ఆధీనంలోనే పెట్టుకుంటున్నాడు. తరువాత అంత విలాసవంతమైన ఇండ్ల మీద పోలీసులు, స్థానికులు ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇవి శ్రీమంతుల ఇండ్లు, వారు అప్పుడప్పుడు వచ్చి వెలుతుంటారు అని ఎస్కేప్ బాబు స్థానికులను నమ్మిస్తున్నాడు.

మైసూరు శివార్లలో!

మైసూరు శివార్లలో!

మైసూరు సమీపంలోని నగువినహళ్ళిలో ఓ విలాసవంతమైన భవనం నిర్మించారు. ఈ ఇంటికి ప్రతినిత్యం ఇతర ప్రాంతాల నుంచి యువతులు, మహిళలు వచ్చి వెలుతున్నారు. బంధువుల అని నమ్మించి విటులుసైతం ఈ విలాసవంతమైన ఇంటికి వచ్చి వెలుతున్నారని పలువురు స్థానికులు పోలీసులు, స్వచ్చంద సంస్థల నిర్వహకులకు సమాచారం ఇచ్చారు.

టీవీ స్టాండ్, మంచం వెనుక హైటెక్ రూం

టీవీ స్టాండ్, మంచం వెనుక హైటెక్ రూం

ఎస్కేప్ బాబు ఎంత తెలివైనవాడు అంటే అతని ప్లాన్ లు చూసి పోలీసులు సైతం షాక్ కు గురౌతున్నారు. నగువినహళ్ళిలోని విలాసవంతమైన ఇంటిలో కొన్ని రోజుల క్రితం దాడులు చేసిన పోలీసులు అక్కడ యువతులు, విటులు ఎవ్వరూ లేకపోవడంతో ఖాళీ చేతులతో వెనుతిరిగారు. ఇంటిలోని టీవీ స్టాండ్ వెనుక రహస్యంగా విలాసవంతమైన గది ఏర్పాటు చేసి అక్కడ హైటెక్ వేశ్వవాటిక నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు.

రాత్రి రహస్యంగా రూం!

రాత్రి రహస్యంగా రూం!

ఎస్కేప్ బాబు తెలివితేటలతో నిర్మించిన హైటెక్ రూంలు గుర్తించిన పోలీసులు ఇప్పుడు షాక్ కు గురైనారు. విలాసవంతమైన భవనాలు నిర్మిస్తున్న ఎస్కేప్ బాబు ఆ ఇండ్లలో రహస్యంగా గదులు నిర్మిస్తున్నాడు. ఎస్కేప్ బాబు దగ్గర ఒక్కడు మాత్రమే అసిస్టెంట్ గా ఉన్నాడు. రహస్యంగా గదులు నిర్మిస్తున్న తన అసిస్టెంట్ (కార్మికుడు)కి నెలకు రూ. లక్షకు పైగా జీతం ఇస్తున్నాడు.

ఒకేఒక్కడు

ఒకేఒక్కడు

భవన కార్మికులను ఇంటిలో గదులు నిర్మించడానికి ఎస్కేప్ బాబు అనుమతి ఇచ్చేవాడు కాదు. అతని అసిస్టెంట్ తోనే రహస్యంగా గదులు నిర్మించే వాడని పోలీసులు అంటున్నారు. ఇంటిలోని షోకేష్ వెనుక, టీవీ స్టాండ్ వెనుక, బెడ్ రూంలోని మంచం వెనుక రహస్యంగా విలాసవంతమైన గదులు నిర్మిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.

పేరు మాత్రమే తెలుసు

పేరు మాత్రమే తెలుసు

ఇంతకాలం ఎస్కేప్ బాబు అనే వ్యక్తి హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నాడని పోలీసులకు తెలుసు. అయితే ఎస్కేప్ బాబును ఏ పోలీసు ఇంత వరకూ చూడలేదు. ఎస్కేప్ బాబు ఎలా ఉంటాడు ? అంటూ పలువురు దగ్గరి పోలీసులు ఆరా తీసినా ఫలితం లేదు. హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్న ఎస్కేప్ బాబును ఎలాగైనా అరెస్టు చెయ్యాలని పోలీసులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

టక్కరిదొంగ చిక్కాడు

టక్కరిదొంగ చిక్కాడు

నగువినహళ్ళిలోని హైటెక్ ఇంటిలో దాడులు చేసిన పోలీసులు టీవీ స్టాండ్ వెనుక ఉన్న రహస్య గదిని గుర్తించారు. ఆ హైటెక్ రూంలో రాసలీలలు సాగిస్తున్న ఇద్దరు యువతులు, ఓ శ్రీమంతుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇదే గది పక్కలోని మరో గదిలో దాక్కొని ఉన్న ఎస్కేప్ బాబును పోలీసులు పట్టుకున్నారు. ఎస్కేప్ బాబు ఇచ్చిన సమాచారం మేరకు అనేక మంది అమాయక యువతులను రక్షించి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+