అత్తతో అక్రమ సంబంధం.. కిడ్నాప్ చేసి మరీ ఆమెతోనే పెళ్లి.. ఏంటా స్టోరీ ?
ఏం జరుగుతుందో.. ఈ సమాజం ఎటు పోతుందో అర్ధం కానీ పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ఓ వైపు భార్యలని భర్తలు.. భర్తలను భార్యలు హత్యలు చేయడం.. మరోవైపు వరుసలు సైతం పట్టించుకోకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇదే తంతు నడుస్తూ సభ్యసమాజాన్ని సైతం తలదించుకునేలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిని కిడ్నాప్ చేసి.. విచక్షణారహితంగా దాడి చేసి.. ఆమె తోనే పెళ్లి చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ దారుణం బీహార్‌లోని సుపౌల్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివచంద్ర, రీటా దేవి అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి పెళ్లై ఐదేళ్లు పైనే అవుతుండగా.. నాలుగేళ్ల ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే రీటా దేవితో గత కొంతకాలం నుంచి అల్లుడి వరసయ్యే మిథిలేష్ కుమార్ ముఖియా అనే యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. శివచంద్ర పని నిమిత్తం భార్యకు దూరంగా ఉంటుండగా.. ఆ సమయంలోనే మిథిలేశ్‌తో స్నేహం కాస్తా వివాహేతర సంబంధంగా మారినట్టు తెలుస్తోంది.

ఒకరోజు వీరిద్దరూ శివచంద్రకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో మిథిలేశ్‌పై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. జూలై 2న, శివచంద్ర తన బంధువులతో కలిసి మిథిలేశ్‌ను కిడ్నాప్ చేసి జీవచ్ఛాపూర్‌లోని ఇంటికి తీసుకువచ్చారు. అక్కడ మిగతా గ్రామస్థుల సమక్షంలో కర్రలతో దాడి చేశారు. ఈ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అనంతరం రీటా దేవిని కూడా తీసుకొచ్చి ఆమెను కూడా కొట్టి తర్వాత మిథిలేశ్ చేత రీటా పాపిటలో సింధూరం పెట్టించి బలవంతంగా పెళ్లి జరిపించారు.
ఈ దారుణం నడుస్తుండగా అడ్డుకునే ప్రయత్నం చేసిన మిథిలేశ్ తల్లిదండ్రులను కూడా కొట్టారు. దాడిలో మిథిలేశ్ వీపు, మెడ, చేతులకు తీవ్ర గాయాలుయ్యాయి. ఆయన తల్లిదండ్రులు మొదట నార్పత్‌గంజ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో అరారియా సదర్ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భీంపూర్ ఎస్‌హెచ్‌ఓ మిథిలేశ్ పాండే నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుంది. దాంతో వెంటనే శివచంద్రతో పాటు ఏడుగురు నిందితులు పరారయ్యారు. మిథిలేశ్ తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications