Facebook: ఆన్ లైన్ క్లాసుల ఎఫెక్ట్, 15 ఏళ్ల అబ్బాయితో సోషల్ మీడియా లేడీ పెళ్లి, సీన్ కట్ చేస్తే, క్లైమాక్స్ !

కోల్ కత్తా/ బెంగళూరు: స్కూల్ కు వెలుతున్న అబ్బాయి కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అంటూ ఆన్ లైన్ క్లాసులకు అలవాటు పడ్డాడు. రెండు సంవత్సరాల నుంచి తల్లిదండ్రుల ఇద్దరి మొబైల్ ఫోన్లు వాడుకుంటున్న ఆ అబ్బాయి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నాడు. ఇదే సమయంలో ఫేస్ బుక్ లో ఆ అబ్బాయి కంటే 7 సంవత్సరాల ఎక్కువ వయసు ఉన్న యువతి టచ్ లోకి వచ్చింది. అబ్బాయి చూడటానికి ఎర్రగా, పొడవుగా, బలంగా ఉండటంతో ఆ యువతి అతని మాయలో పడిపోయింది. మైనర్ అబ్బాయితో ఫేస్ బుక్ లోనే ప్రేమలో పడిపోయిన యువతి కొన్ని నెలల పాటు అతనితో చాటింగ్ చేసింది. తన కంటే వయసులో చిన్నవాడైన యువకుడిని వదిలి ఉండలేని ఆ యువతి అతన్ని లేపుకుపోయి పెళ్లి చేసుకుంది. మైనర్ ను వివాహం చేసుకున్న యువతి ఇప్పుడు కష్టాలు కొని తెచ్చుకుంది.

 ఆన్ లైన్ క్లాసులు+ సోషల్ మీడియా

ఆన్ లైన్ క్లాసులు+ సోషల్ మీడియా


పశ్చిమ బెంగాల్ లోని కోత్వాలిలో 15 ఏళ్ల అబ్బాయి నివాసం ఉంటున్నాడు. 10వ తరగతి చదువుతున్న ఆ అబ్బాయి గతంలో ప్రతిరోజూ స్కూల్ కు వెళ్లి వచ్చేవాడు. స్కూల్ కు వెలుతున్న అబ్బాయి కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అంటూ ఆన్ లైన్ క్లాసులకు అలవాటు పడ్డాడు. రెండు సంవత్సరాల నుంచి తల్లిదండ్రుల ఇద్దరి మొబైల్ ఫోన్లు వాడుకుంటున్న ఆ అబ్బాయి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నాడు.

 ఫేస్ బుక్ యువతి

ఫేస్ బుక్ యువతి

పశ్చిమ బెంగాల్ లోని శాంతి నగరలో 22 ఏళ్ల వయసు ఉన్న కీర్తి (పేరు మార్చడం జరిగింది) అనే యువతి సోసల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తో పాటు సోషల్ మీడియాలో కీర్తికి చాలా అకౌంట్లు ఉన్నాయి. కాలేజ్ చదువు పూర్తి చేసుకున్న కీర్తి ఇంట్లో ఉంటూ ప్రతినిత్యం సోషల్ మీడియాలో కాలం గడుపుతోంది.

 మైనర్ అబ్బాయితో లవ్

మైనర్ అబ్బాయితో లవ్

స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న అబ్బాయికి, కాలేజ్ చదువు పూర్తి చేసుకున్న కీర్తికి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. ఇదే సమయంలో ఫేస్ బుక్ లో ఆ అబ్బాయి కంటే 7 సంవత్సరాల ఎక్కువ వయసు ఉన్న యువతి టచ్ లోకి రావడంతో అక్కడ వ్యవహారం చెడిపోయింది. అబ్బాయి ఫోటోలు చూసిన కీర్తి అతని ప్రేమలో పడిపోయింది.

 అబ్బాయి ఎర్రగా, బుర్రగా ఉన్నాడని

అబ్బాయి ఎర్రగా, బుర్రగా ఉన్నాడని

అబ్బాయి చూడటానికి ఎర్రగా, పొడవుగా, బలంగా ఉండటంతో కీర్తి అతని మాయలో పడిపోయింది. మైనర్ అబ్బాయితో ఫేస్ బుక్ లోనే ప్రేమలో పడిపోయిన కీర్తి రోజూ గంటలు గంటలు అతనితో సోషల్ మీడియాలో చాటింగ్ చేసింది. కీర్తి అందచందాలు చూపించడంతో మైనర్ అబ్బాయి కూడా ఆమె వలలో పడిపోయాడు.

మైనర్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న కిలాడీ లేడి

మైనర్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న కిలాడీ లేడి

కొన్ని నెలలపాటు మైనర్ అబ్బాయితో చాటింగ్ చేసిన కీర్తి ఆమె బూతు మాటలతో అతన్ని వలలో వేసుకుంది. మనం ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుందామని కీర్తి ఆ అబ్బాయికి చెప్పింది. కిలాడీ లేడీ కీర్తి మాయమాటలు నమ్మిన ఆ అబ్బాయి ఇళ్లు వదిలి ఆమెతో పాటు పారిపోయి పెళ్లి చేసుకున్నాడు.

Recommended Video

    Mark Zuckerberg కీలక నిర్ణయం, ఆ ముద్రను చెరుపుకునేందుకే..! | Oneindia Telugu
     ఎంజాయ్ చెయ్యాలని అనుకుని జైలు పాలైయ్యింది

    ఎంజాయ్ చెయ్యాలని అనుకుని జైలు పాలైయ్యింది

    మైనర్ అబ్బాయి కనపడకపోవడంతో అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసుల విచారణలో కీర్తి మైనర్ అబ్బాయి ప్రేమపురాణం బయటకు వచ్చింది. కొన్ని రోజుల పాటు గాలించిన పోలీసులు కీర్తితో పాటు మైనర్ అబ్బాయిని పట్టుకున్నారు. మైనర్ అబ్బాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో కిలాడీ లేడీని అరెస్టు చేసిన పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+