Facebook lover: ఎంజాయ్ చేసి ప్రియుడు ఎస్కేప్, లవర్ కోసం వెళ్లి శవమైయ్యింది, ముందే పెళ్లి !

చెన్నై/క్రిష్ణగిరి/కొచ్చి: ఐదు సంవత్సరాల క్రితం ఫేస్ బుక్ లో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. పక్క రాష్ట్రంలో ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువతిని చూడటానికి ఆ యువకుడు పక్కరాష్టానికి వెళ్లి వచ్చాడు. రెండు సంవత్సరాలు ప్రియురాలు నివాసం ఉంటున్న ఊరిలో మకాం వేసిన యువకుడు ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.ఇద్దరూ కలిసి షాపింగ్ లు చేశారు. ఇద్దరూ కలిసి బంగారు నగలు కొనుకున్నారు. కొంతకాలం క్రితం మా ఇంట్లో సమస్యలు ఉన్నాయని చెప్పిన ప్రియుడు మాయం అయిపోయాడు. కొన్ని నెలల పాటు ప్రియుడు తిరిగి వస్తాడని ఎదురు చూసిన ప్రియురాలు నిరాశ చెందింది. ప్రియుడిని వెతుక్కుంటూ ఆమె అతని ఊరికి వెళ్లింది. ప్రియుడికి ఇంతకు ముందే వివాహం అయ్యిందని ప్రియురాలికి తెలిసింది. ప్రియుడిని కచ్చితంగా కలవాలని ప్రయత్నాలు చేస్తున్న యువతి రోడ్డు పక్కన శవమై కనిపించడం కలకలం రేపింది.

 ఫేస్ బుక్ లో పరిచయం

ఫేస్ బుక్ లో పరిచయం

కేరళలోని తిరువనంతపురంలో నివాసం ఉంటున్న రంజని (25) అనే యువతి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని కావేరిపట్నం సమీపంలోని వెలంపట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్న సూర్యా (22) అనే యువకుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం ఫేస్ బుక్ లో రంజని, సూర్యాకు పరిచయం అయ్యింది.

 కేరళకు ట్రిప్పు వేసిన సూర్యా

కేరళకు ట్రిప్పు వేసిన సూర్యా

ఫేస్ బుక్ లో పరిచయం అయిన రంజనితో సూర్యా ఎక్కువగా టచ్ లో ఉన్నాడు. తరువాత రంజని, సూర్యా పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కేరళ రాష్ట్రంలో ఉంటున్న ఫేస్ బుక్ ఫ్రెండ్ రంజనిని చూడటానికి సూర్యా పక్కరాష్టానికి వెళ్లి వచ్చాడు. సూర్యా కారు డ్రైవర్ కావడంతో అతను ఎక్కువగా కేరళ ట్రిప్పులు వెళ్లి రంజనితో టచ్ లో ఉన్నాడు.

 ప్రియురాలి ఊరిలో మకాం వేసిన ప్రియుడు

ప్రియురాలి ఊరిలో మకాం వేసిన ప్రియుడు

రెండు సంవత్సరాల క్రితం సూర్యా ప్రియురాలు రంజని నివాసం ఉంటున్న తిరువనంతపురం వెళ్లిపోయి అక్కడే కారు డ్రైవర్ గా పని చేశాడు. ఆ సమయంలో నిత్యం రంజని, సూర్యా కలుసుకోవడం మొదలుపెట్టారు. రెండు సంవత్సరాలు ప్రియురాలు రంజని నివాసం ఉంటున్న తిరువనంతుపురంలో ఉన్న సూర్యా ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.

 ప్రియురాలితో షాపింగ్ లు.... షికార్లు

ప్రియురాలితో షాపింగ్ లు.... షికార్లు

రంజని, సూర్యా కలిసి షాపింగ్ లు చేశారు. ఇద్దరూ కలిసి షికార్లు తిరిగారు. రంజనితో కలిసి ఆమె డబ్బులతోనే సూర్యా బంగారు నగలు కొనుగోలు చేశాడు. కొన్ని నెలల క్రితం మా ఇంట్లో సమస్యలు ఉన్నాయని చెప్పిన సూర్యా చిన్నగా తిరువనంతపురం నుంచి బయటపడి తరువాత ఆమెకు కనపడకుండా మాయం అయిపోయాడు.

 ప్రియుడి కోసం వెతుక్కుంటూ వెళ్లిన ప్రియురాలు

ప్రియుడి కోసం వెతుక్కుంటూ వెళ్లిన ప్రియురాలు

కొన్ని నెలల పాటు ప్రియుడు సూర్యా తిరిగి వస్తాడని ఎదురు చూసిన ప్రియురాలు రంజని నిరాశ చెందింది. ప్రియుడు సూర్యాను వెతుక్కుంటూ నాలుగు నెలల క్రితం రంజని అతని సొంత ఊరు క్రిష్ణగిరిలోని కావేరిపట్నంకు వెళ్లింది. ప్రియుడు సూర్యాకు ఇంతకు ముందే వివాహం అయ్యిందని కొందరి ద్వారా తెలుసుకున్న అతని ప్రియురాలు రంజని షాక్ అయ్యింది.

రొడ్డు పక్కన శవమైన రంజని

రొడ్డు పక్కన శవమైన రంజని

ప్రియుడు సూర్యా ఎప్పటికైనా కనపడుతాడని ఆశతో రంజని కేరళకు వెళ్లకుండా కావేరిపట్నంలోని ఓ సూపర్ మార్కెట్ లో ఉద్యోగం చేస్తూ అతని కోసం గాలించడం మొదలు పెట్టింది. అయితే ప్రియుడి కోసం వెతుక్కుంటూ వచ్చిన రంజని రాత్రి రోడ్డు పక్కన శవమై కనిపించింది. రంజని ముఖం కాలిపోయి ఉండటంతో స్థానికులు హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 హత్యా ? ఆత్మహత్యా

హత్యా ? ఆత్మహత్యా

ప్రియుడు కనపడలేదని రంజని ఆత్మహత్య చేసుకుందా ? లేక ఆమెను ఎవరైనా హత్య చేశారా ? అనే విషయం తెలీదని పోలీసులు అంటున్నారు. రంజని ప్రియుడు సూర్యా కూడా కనపడకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, రంజని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసు విచారణ చేస్తున్నామని కావేరిపట్నం పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ఫేస్ బుక్ ప్రియుడి కోసం వచ్చిన రంజని శవమై కనిపించడం కావేరిపట్నంలో కలకలం రేపింది.

 ప్రియుడు ఎక్కడున్నాడు ?

ప్రియుడు ఎక్కడున్నాడు ?

రంజని, సూర్యా కలిసి తిరువనంతపురంలో ప్రత్యేకంగా రూమ్ తీసుకుని నివాసం ఉండేవారని తెలిసింది. మొదట తన కోసం రూమ్ తీసుకున్న సూర్యా అదే రూమ్ లోకి ప్రియురా రంజనిని పిలుపించుకుని ఆమెతో ఎంజాయ్ చేశాడని తెలిసింది. ప్రియురాలు రంజనిని మోసం చేసి సొంత ఊరు చేరుకున్న సూర్యా తరువాత డ్రైవర్ పని వదిలేసి కొంతకాలం మార్కెట్ లో పని చేశాడని పోలీసులు అంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని రంజని ఒత్తిడి చెయ్యడం వలన ఆమెను సూర్యా ఏమైనా హత్య చేశాడా ?, లేక ప్రియుడు మోసం చేశాడని రంజని ఆత్మహత్య చేసుకుందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

కావేరిపట్నం చేరుకున్న తరువాత రంజనికి మరెవరైనా పరిచయం అయ్యారా ? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద సూర్యా చిక్కితేనే రంజని ఎలా చనిపోయింది అనే విషయం కచ్చితంగా తెలుస్తోందని కావేరిపట్నం పోలీసులు అంటున్నారు.సూర్యా ప్రియురాలు రంజని హత్యకు గురి కావడంతో అతని కుటుంబ సభ్యులను విచారణ చెయ్యాలని కావేరిపట్నం పోలీసులు, కేరళ పోలీసులు అధికారులు సిద్దం అయ్యారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+