SI:ప్రియురాలితో పుమ్ పుహార్ అంటూ తిరిగేసిన ఎస్ఐ, సీక్రేట్ గా వేరే అమ్మాయితో పెళ్లి, క్లైమాక్స్ లో సార్ కు !

ఫేస్ బుక్ లో ఎస్ఐకి అందమైన అమ్మాయి పరిచయం అయ్యింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేశారు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న ఎస్ఐ మీద అతని ప్రియురాలు రేప్ కేసు పెట్టింది.

బెంగళూరు/బెళగావి: ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న యువకుడు పోలీసు శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగం చెయ్యడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఫేస్ బుక్ లో ఎస్ఐకి అందమైన అమ్మాయి పరిచయం అయ్యింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పలు నగరాలకు వెళ్లి ఎంజాయ్ చేశారు. విషయం పెద్దలకు తెలిసి పంచాయితీలు పెట్లారు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అందరి ముందు అమ్మాయి ఫ్యామిలీకి ఆ ఎస్ఐ బాండు పేపర్ మీద అగ్రిమెంట్ రాసిచ్చాడు. అయితే ప్రియురాలికి తెలీకుండా ఎస్ఐ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. ఎస్ఐ మీద అతని ప్రియురాలు రేప్ కేసు పెట్టింది. ఎస్ఐ మీద రేప్ కేసుతో పాటు అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

ఎస్ఐ మీద రేప్ కేసు

ఎస్ఐ మీద రేప్ కేసు

యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్న ఎస్‌ఐపై కర్ణాటకలోని బెళగావి నగరంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వైర్‌లెస్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న లాల్ సాబ్ నాధాప్‌పై రేప్ కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేస్తున్నారు. రేప్ కేసు పెట్టిన యువతికి వైద్యపరీక్షలు చేయిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

ఫేస్ బుక్ ప్రియురాలితో ?

ఫేస్ బుక్ ప్రియురాలితో ?

బెళగావి జిల్లా రామదుర్గ తాలూకాకు చెందిన ఓ యువతికి, ఎస్ఐ లాల్ సాబ్ కు గత ఏడాది ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యింది. ఆ తరువాత యువతి, ఎస్ఐ లాల్ సాబ్ ఒకరికొకరు సన్నిహితంగా మారి ప్రేమలో పడ్డారు. కొంతకాలం నుంచి బెంగుళూరు, హుబ్లీ, ధారవాడతో సహా కర్ణాటక, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు ప్రియురాలిని పిలుచుకుని వెళ్లిన ఎస్ఐ లాల్ సాబ్ ఎంజాయ్ చేశాడు. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఎస్ఐ లాల్ సాబ్ ఆమెను శారీరకం లొంగదీసుకుని ఎంజాయ్ చేసి అతని కోరికలు తీర్చుకున్నాడు.

నీకు దిక్కున్న చోట చెప్పుకో

నీకు దిక్కున్న చోట చెప్పుకో

ఎస్ఐ లాల్ సాబ్, యువతి ఎక్కువగా బయట తిరుగుతున్నారనే విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలిసింది. ఆసమయంలో మీకు ఎలాంటి భయం వద్దని, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో ఎస్‌ఐ లాల్ సాబ్ యువతి కుటుంబ సభ్యులకు బాండ్‌ పేపర్ మీద అగ్రిమెంట్‌ రాసిచ్చారు. పెళ్లి చేసుకుంటానని ప్రియురాలితో బాండు పేపర్ మీద అగ్రిమెంట్ చేసుకున్న ఎస్ఐ లాల్ సాబ్ తరువాత ఎదురు తిరిగి నీకు దిక్కున్నచోట చెప్పుకో, నిన్ను పెళ్లి చేసుకుని అని ప్రియురాలికి తేల్చి చెప్పాడు.

సీక్రేట్ గా వేరే అమ్మాయితో ఎస్ఐ పెళ్లి

సీక్రేట్ గా వేరే అమ్మాయితో ఎస్ఐ పెళ్లి

స్‌ఐ లాల్‌ సాబ్ నదాఫ్‌ అతను ప్రేమించిన యువతిని ఒప్పందం ప్రకారం పెళ్లి చేసుకోకుండా కొంతకాలం గడిపేశాడు. అయితే నెల రోజుల క్రితమే మరో యువతిని పెళ్లి చేసుకున్న ఎస్ఐ లాల్ సాబ్ ఆమెతో సీక్రేట్ గా కాపురం చేస్తున్నాడు. తన ప్రియుడు లాల్ సాబ్ పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న ప్రియురాలు రగిలిపోయింది. ఎస్ఐ లాల్ సాబ్ తనను మోసం చేశాడని బాధితురాలు బెళగావి నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆయన మీద ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి తన మీద ఎస్ఐ అత్యాచారం చేశాడని ప్రియురాలు కేసు నమోదు చేసింది.

నెల రోజులుగా ఉద్యోగానికి రాకుండా కాపురం చేస్తున్న ఎస్ఐ మీద రేప్ కేసు

నెల రోజులుగా ఉద్యోగానికి రాకుండా కాపురం చేస్తున్న ఎస్ఐ మీద రేప్ కేసు

నెల రోజులకు పైగా ఎస్ఐ లాల్ సాబ్ విధులకు హాజరుకావడం లేదని సాటి పోలీసులు అంటున్నారు. కొద్దిరోజుల క్రితం బెళగావి లా అండ్ ఆర్డర్ డిపార్ట్‌మెంట్ డిసీపీకి తాను ఎస్ఐ లాల్ సాబ్ మీద ఫిర్యాదు చేశానని, ఆ సమయంలో డీసీపీ తననే దూషించి పంపించేశారని యువతి ఆరోపిస్తున్నది. ఎస్ఐ లాల్ సాబ్ పోలీసు కార్యాలయంలోని వైర్‌లెస్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నాడని కొందరు పోలీసులు అతనికే సపోర్ట్ చేశారని యువతి ఆరోపిస్తున్నది. బెళగావి నగరంలోని ఎస్‌ఐ లాల్ సాబ్ తన మీద అత్యాచారం చేశాడని ఓ మహిళ కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. పోలీసు అధికారి జాన్‌గౌడ్‌ జానరా నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+