ప్రపంచవ్యాప్తంగా గంట పాటు... నిలిచిపోయిన ఫేస్‌బుక్,వాట్సాప్,ఇన్‌స్టాగ్రామ్ సేవలు...
ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఫేస్‌బుక్,వాట్సాప్,ఇన్‌స్టాగ్రామ్,ఫేస్‌బుక్ మెసేంజర్ సేవలు ఒక గంట పాటు నిలిచిపోయాయి. శుక్రవారం(మార్చి 19) రాత్రి 10.55గంటల సమయంలో ఈ సమస్య తలెత్తింది. తిరిగి 11.42గంటల తర్వాత గానీ ఈ సోషల్ నెట్‌వర్క్ యాప్స్ సేవలు అందుబాటులోకి రాలేదు. దీంతో చాలామంది యూజర్లు... తమకు మాత్రమే ఇలా జరుగుతోందా... లేక అందరికీ ఇదే సమస్య తలెత్తిందా అన్న అయోమయంలో పడ్డారు. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో పోస్టులో పెట్టారు.
ఫేస్‌బుక్,ఫేస్‌బుక్ మెసేంజర్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు పంపించిన మెసేజ్‌లు ఫార్వర్డ్ అవలేదు. వాట్సాప్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆ గంట సమయంలోనే దాదాపు 40వేల మంది వాట్సాప్ యూజర్లు,12వేల మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు డౌన్‌డిటెక్టర్‌లో సమస్యపై రిపోర్ట్ చేశారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఫేస్‌బుక్ మాతృ సంస్థకు చెందిన కంపెనీలనే విషయం తెలిసిందే. ఈ మూడు సోషల్ నెట్‌వర్క్ సర్వీసులు ఒకేసారి నిలిచిపోవడం గమనార్హం. అయితే ఎందుకీ సమస్య తలెత్తిందన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.గతేడాది డిసెంబర్‌లోనూ ఒక్కసారిగా అన్ని ఫేస్‌బుక్ సర్వీసులు కొద్ది గంటల పాటు నిలిచిపోయాయి.

ఈరోజుల్లో సోషల్ నెట్‌వర్క్ యాప్స్ ప్రజల జీవితంలో ఎంతగా భాగమయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఒక గంట పాటు మూడు ప్రధాన సోషల్ నెట్‌వర్క్ సర్వీసులు నిలిచిపోవడంతో చాలామంది యూజర్లకు ఏమీ తోచలేదు. ఎందుకిలా జరుగుతుందో తెలియక చాలామంది గందరగోళానికి గురయ్యారు. ఇక ఈ మూడు సర్వీసులు పునరుద్దరించిన వెంటనే విపరీతమైన మీమ్స్,జోక్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ గంట సమయంలో యూజర్ల మూడ్ ఎలా ఉందో ప్రతిబింబించేలా ఫన్నీ మీమ్స్‌ను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.
Everyone running to twitter to confirm that WhatsApp is down. #WhatsAppDown pic.twitter.com/rCsc2zTGdD
— ʀᴀᴛʜᴏᴅ ᴅʜᴀᴠᴀʟ (@iamdhavalsinh) March 19, 2021












Click it and Unblock the Notifications