Facebook: ఫేస్ బుక్ ప్రియురాలి కోసం వెళ్లి ?, భర్త చేతితో దెబ్బలు తినిపారిపోయి, ఏమైపోయాడు ? !
కొచ్చి/కన్యాకుమారి: ఓ యువకుడు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటున్నాడు. కొంతకాలం క్రితం ఫేస్ బుక్ లో ఓ మహిళ అతనికి పరిచయం అయ్యింది. కొంతకాలం ఇద్దరూ సోషల్ మీడియాలో పిచ్చపాటిగా చాటింగ్ చేశారు. రానురాను ఇద్దరి మద్య గొడవలు మొదలైనాయి. చివరికి అతని ఫోన్ నెంబర్, అతని సోషల్ మీడియా అకౌంట్లను ఆమె బ్లాక్ చేసింది. ఫేస్ బుక్ ప్రియురాలి కోసం అతను ఇద్దరు స్నేహితులను వెంటపెట్టుకుని ఆమె నివాసం ఉంటున్న ఏరియాలోకి వెళ్లి ఆమె ఇంటి కోసం వెతికాడు. విషయం గుర్తించిన ఫేస్ బుక్ లేడీ ఆమె భర్త, ఆమె సోదరుడికి, బందువులకు విషయం చెప్పింది. ఫేస్ బుక్ ఫ్రెండ్ ను ప్రియురాలి కుటుంబ సభ్యులు తరిమితరిమికొట్టారు. ఆ సందర్బంలో ముగ్గురూ అక్కడి నుంచి తప్పించుకుని సముద్రం ఒడ్డు నుంచి పారిపోయారు. ఫేస్ బుక్ ప్రియుడు మాత్రం ఇంత వరకు కనపడలేదు. ఇదే సమయంలో సముద్రంలో ఓ యువకుడు శవం చిక్కడం కలకలం రేపింది.

సోషల్ మీడియాలో ?
కేరళలోని తిరువనంతపురం సమీపంలోని నారిమన్ ముడు ప్రాంతంలో కిరణ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సోషల్ మీడియాలో కిరణ్ చాలా ఎక్కువ యాక్టీవ్ గా ఉంటున్నాడు. కొంతకాలం క్రితం ఫేస్ బుక్ లో కేరళలోని అజిమలై ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ కిరణ్ కు పరిచయం అయ్యింది.

ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్
కొంతకాలం కిరణ్, ఆమె సోషల్ మీడియాలో పిచ్చపాటిగా చాటింగ్ చేశారు. రానురాను ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు. కొంతకాలం క్రితం ఇద్దరి మద్య గొడవలు మొదలైనాయి. చివరికి కిరణ్ ఫోన్ నెంబర్, అతని సోషల్ మీడియా అకౌంట్లను ఆమె బ్లాక్ చేసిన మహిళ అతనికి దూరం అయ్యింది.

ప్రియురాలి ఊరికే వెళ్లిపోయాడు
ఫేస్ బుక్ ప్రియురాలితో ఎలాగైనా మాట్లాడాలని అనుకున్న కిరణ్ అతని ఇద్దరు స్నేహితులను వెంటపెట్టుకుని అజిమలైలో ఆమె నివాసం ఉంటున్న ఏరియాలోకి వెళ్లాడు. ఫేస్ బుక్ ప్రియురాలు ఇల్లు కనుక్కోవాలని కిరణ్ అదే ప్రాంతంలో తిరగడం మొదలుపెట్టాడు. కిరణ్ ను చూసిన ఫేస్ బుక్ ప్రియురాలు కొంప మునిగిపోతుందని భయపడి ఆమె భర్త, ఆమె సోదరుడికి, బందువులకు విషయం చెప్పింది.

తరిమితరిమి కొట్టారు
ఫేస్ బుక్ ఫ్రెండ్ కిరణ్ ను అతని ఫేస్ బుక్ ప్రియురాలి కుటుంబ సభ్యులు పట్టుకుని చితకబాదేశారు. తరువాత కిరణ్ తో పాటు అతని స్నేహితులను ఆ ఏరియాలో తరిమితరిమికొట్టారు. ఆ సందర్బంలో ముగ్గురూ అక్కడి నుంచి తప్పించుకుని సముద్రం ఒడ్డు నుంచి పారిపోయారు. కిరణ్ స్నేహితులు వాళ్ల ఊరికి వెళ్లిపోయారు.

కన్యాకుమారిలో శవం
ఫేస్ బుక్ ప్రియుడు కిరణ్ మాత్రం ఇంత వరకు కనపడలేదు. పోలీసులు ఆ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. సముద్రం ఒడ్డునుంచి కిరణ్ పారిపోతున్న విషయం పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు కిరణ్ సముద్రంపడిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సముద్రంలో ఓ యువకుడు శవం చిక్కడం కలకలం రేపింది.

శవం ఏవరిది ?
అయితే శవం కిరణ్ ది అని అతని కుటుంబ సభ్యులు కూడా నిర్దారించలేకపోతున్నారు. డీఎన్ఏ పరీక్షల కోసం శవాన్ని తరలించామని పోలీసులు అంటున్నార. మొత్తం మీద ఫేస్ బుక్ ప్రియురాలి కోసం వెళ్లిన యువకుడు ఆమె కుటుంబ సభ్యుల దాడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించి కనపడకుండా పోవడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications