శ్రీకృష్ణుడి అవతారమంటూ కామక్రీడలు: భక్తి ముసుగులో బలత్కారం!
మనుషుల నమ్మకాన్ని, భక్తిని ఆసరాగా చేసుకుని మహిళల జీవితాలతో ఆడుకుంటున్న మరో దొంగ బాబా బండారం బయటపడింది 'నరదిష్టి' పోగొడతానంటూ నమ్మించి ఓ వివాహితపై రెండేళ్ల పాటు లైంగిక దాడికి పాల్పడిన అశోక్ ఖరాత్ అనే దొంగ బాబాను నాసిక్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
నాసిక్‌కు చెందిన 24 ఏళ్ల వివాహిత డీ-ఫార్మసీ చదువుతోంది. తన వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని భావించిన ఆమె..భర్తతో కలిసి అశోక్ ఖరాత్ ఆశ్రమానికి వెళ్లింది. వీరి చేతులు చూసిన ఆ దొంగబాబా.. మీ పెళ్లికి దిష్టి తగిలిందని.. దానివల్ల ప్రాణాపాయం కూడా ఉండవచ్చని భయపెట్టాడు. ఓ బాటిల్ నీళ్లు ఇచ్చి మూడు రోజుల పాటు బెడ్రూంలో ఉంచమని.. ఆ నీరు నల్లగా మారితే దోషం పోయినట్టేనని నమ్మబలికాడు. జనమంతా అతడిని గొప్పవాడని పొగుడుతుండడంతో ఆ దంపతులు అతడి మాటలను గుడ్డిగా నమ్మారు.

మత్తు ఇచ్చి.. కృష్ణావతారం అని నమ్మించి..
ఓ రోజు సదరు మహిళను విడిగా తన కేబిన్‌లోకి పిలిచిన అశోక్ ఖరాత్.. భర్తను బయట ఉంచి తలపులు వేయించాడు. ఆమెకు చేదుగా ఉన్న ఓ తీర్థాన్ని ఇచ్చి తాగమన్నాడు. అది తాగగానే ఆమెకు కళ్లు తిరగడం ప్రారంభమైంది. ఆ స్థితిలో ఉన్న ఆమెను తల మీద గ్లాసు పెట్టుకుని కళ్లు మూసుకుని గాయంత్రీ మంత్రాన్ని జపించమన్నాడు. ఆమె కళ్లు మూసుకోగానే గదిలో లైట్లు ఆర్పేసి వెనుక నుంచి బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను శ్రీకృష్ణుడి అవతారమని.. ఆమెను రాధ అని పిలుస్తూ అసహజ లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు.
రెండేళ్ల నరకం.. బెదిరింపులు
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే భర్తను చంపేస్తానని ఆ దొంగ బాబా ఆమెను భయపెట్టాడు. దీంతో భయంతో భిక్కుభిక్కుమంటూ కాలం గడుపుతున్న ఆమెను..ప్రతి పరీక్షకు ముందు ఆశీర్వాదం తీసుకోవాలనే నెపంతో పిలిపించుకుని 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు నిరంతరం వేధిస్తూనే ఉన్నాడు. దాదాపు 200 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఈ నిందితుడి వెనుక పెద్ద రాజకీయ పలుకుబడి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
నిజం బయటపడిందిలా..
మార్చి 2026లో ఓ బంధువు ద్వారా అశోక్ ఖరాత్ అసలు రంగు తెలుసుకున్న బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. మార్చి 17న నాసిక్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ దొంగబాబా ఆగడాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు మరిన్న ఆధారాలను సేకరిస్తున్నారు. ఇంకా ఎంత మంది అమాయక మహిళలు ఈ దొంగ బాబా బారిన పడ్డారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది పరువు కోసం బయటకు రావడం లేదని తెలుస్తోంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications