వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Family: విసిగిపోయిన మాజీ ఆర్మీ ఉద్యోగి, భార్య, కూతుర్ని చంపేశాడు, మరో కూతురికి ఫోన్ చేసి ?, చాలు !

|
Google Oneindia TeluguNews

ముంబాయి: ఆర్మీలో ఉద్యోగం చేసిన ఆయన భార్య, పిల్లలను బాగా చూసుకున్నాడు. ఆర్మీలో రిటైడ్ అయ్యేలోపు ఓ కుమార్తెకు పెళ్లి చేశాడు. మానసిక అస్వస్థతకు గురైన కుమార్తెకు పెళ్లి కాకపోవడంతో ఆమె తల్లిదండ్రుల దగ్గరే నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల నుంచి భార్య అనారోగ్యానికి గురి కావడంతో ఆర్మీ మాజీ ఉద్యోగి ఆయన భార్య బాగోలు చూసుకుంటున్నాడు. ఇక పుట్టినప్పటి నుంచి తమ మీదే అధారపడిన కుమార్తెను సైతం ఆమె తండ్రి చూసుకుంటున్నాడు. ఆర్మీ మాజీ ఉద్యోగి మరో కుమార్తె వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నది. భార్య, కూతురి మానసిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుండటంతో ఆయన తల్లడిల్లిపోయాడు. భార్య, కూతురిని దారుణంగా చంపేసిన ఆర్మీ మాజీ ఉద్యోగి కొన్ని గంటల పాటు ఇద్దరి శవాల పక్కన కాలం గడిపాడు. చివరికి మరో కూతురికి ఫోన్ చేసిన ఆర్మీ మాజీ ఉద్యోగి మీ అమ్మా, నీ సోదరి ఇక లేరు, ఇద్దర్ని చంపేశానని చెప్పడంతో ఆమె హడలిపోయింది

Hijab: బికినీలు, జీన్స్ వేసుకుంటారు, బుర్కా అయినా వేసుకుంటారు, మీకెందుకు ?, ప్రియాంకా గాంధీ!Hijab: బికినీలు, జీన్స్ వేసుకుంటారు, బుర్కా అయినా వేసుకుంటారు, మీకెందుకు ?, ప్రియాంకా గాంధీ!

 ఆర్మీ రిటైడ్ ఉద్యోగి

ఆర్మీ రిటైడ్ ఉద్యోగి

ముంబాయిలోని అంధేరి ఈస్ట్ ప్రాంతంలోని షేర్-ఎ-పంజాబ్ కాలనీలో పురుషోత్తమ్ సింగ్ గంధక్ అలియాస్ పురుషోత్తమ్ సింగ్ (89) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. ఆర్మీలో ఉద్యోగం చేస్తూ పురుషోత్తమ్ సింగ్ రిటైడ్ అయ్యాడు. పురుషోత్తమ్ సింగ్ ఆయన భార్య జస్పీర్ కౌర్ (81), కుమార్తె కమల్ జీత్ కౌర్ (55)తో కలిసి ఓకే ఇంట్లో నివాసం ఉంటున్నాడు.

 మానసిక అస్వస్థతకు గురైన కూతురు

మానసిక అస్వస్థతకు గురైన కూతురు

ఆర్మీలో ఉద్యోగం చేసిన పురుషోత్తమ్ సింగ్ ఆయన భార్య జస్పీర్ కౌర్, పిల్లలను బాగా చూసుకున్నాడు. ఆర్మీలో రిటైడ్ అయ్యేలోపు పురుషోత్తమ్ సింగ్ ఓ కుమార్తెకు పెళ్లి చేశాడు. మానసిక అస్వస్థతకు గురైన కుమార్తె కమల్ జీత్ కౌర్ కు పెళ్లి కాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పురుషోత్తమ్ సింగ్, జస్పీర్ కౌర్ దగ్గరే నివాసం ఉంటున్నది.

 10 ఏళ్ల నుంచి భార్యకు సేవ చేస్తున్న భర్త

10 ఏళ్ల నుంచి భార్యకు సేవ చేస్తున్న భర్త

కొన్ని సంవత్సరాల నుంచి భార్య జస్పీర్ కౌర్ అనారోగ్యానికి గురి కావడంతో ఆర్మీ మాజీ ఉద్యోగి పురుషోత్తమ్ సింగ్ ఆయనే దగ్గర ఉండి ఆయన భార్య బాగోలు చూసుకుంటున్నాడు. ఇక పుట్టినప్పటి నుంచి తమ మీదే అధారపడిన కుమార్తె కమల్ జీత్ కౌర్ ను కూడా ఆమె తండ్రి పురుషోత్తమ్ సింగ్ చూసుకుంటున్నాడు. భార్యను 10 ఏళ్ల నుంచి, పుట్టినప్పటి నుంచి కుమార్తెను పురుషోత్తమ్ సింగ్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు.

 భార్య, కూతురిని దారుణంగా చంపేశాడు

భార్య, కూతురిని దారుణంగా చంపేశాడు

ఆర్మీ మాజీ ఉద్యోగి పురుషోత్తమ్ సింగ్ మరో కుమార్తె అంధేరిలోనే వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నది. భార్య జస్పీర్ కౌర్ , కూతరి మానసిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుండటంతో పురుషోత్తమ్ సింగ్ తల్లడిల్లిపోయాడు. భార్య, కూతురిని దారుణంగా చంపేసిన ఆర్మీ మాజీ ఉద్యోగి పురుషోత్తమ్ సింగ్ కొన్ని గంటల పాటు ఇద్దరి శవాల పక్కన కాలం గడిపాడు. చివరికి 12 గంటల తరువాత మరో కూతురికి ఫోన్ చేసిన ఆర్మీ ఉద్యోగి పురుషోత్తమ్ సింగ్ మీ అమ్మా, నీ సోదరి ఇక లేరు, ఇద్దర్ని చంపేశానని చెప్పడంతో ఆమె హడలిపోయింది.

 సేవ చేసే ఓపికలేక చంపేశాను

సేవ చేసే ఓపికలేక చంపేశాను

వెంటనే తండ్రి పురుషోత్తమ్ సింగ్ ఇంటికి వెళ్లిన కూతురు తలుపు తియ్యాలని చెప్పింది. పోలీసులు వచ్చే వరకు తాను తలుపులు తియ్యనని పురుషోత్తమ్ సింగ్ మొండికి వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న తరువాతే పురుషోత్తమ్ సింగ్ ఇంటి తలుపులు తీశాడు. తన భార్య, కూతురిని సేవలు చేసి చేసి విసిగిపోయానని, ఇక ముందు వారిని చూసుకునే ఓపిక లేకపోవడంతో ఇద్దరన్ని చంపేశానని పురుషోత్తమ సింగ్ విచారణలో అంగీకరించాడని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అంటున్నారు.

English summary
Family: Fed up with prolonged illness of his daughter and wife, Ex-Armyman murders both in Mumbai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X