సినీ నటులు ముఖ్యమంత్రులు అయ్యారు, మీ కొడుకు హీరో కాదా, సీఎం కుమారకు తారా పంచ్!
మంగళూరు: సినిమా నటులు రాజకీయాల్లో రాణించారని, తిరుగులేని నాయకులు అనిపించుకుని ముఖ్యమంత్రులు అయ్యారని ప్రముఖ బహుబాష నటి, బీజేపీ నాయకురాలు తారా అన్నారు. కర్ణాటకలోని మంగళూరులో స్థానిక సిట్టింగ్ ఎంపీ (బీజేపీ) నిళిన్ కుమార్ కిటేల్ కు మద్దతుగా తారా ప్రచారం నిర్వహించిన తారా ముఖ్యమంత్రి కుమారస్వామి మీద మండిపడ్డారు.
మంగళూరులోని స్టేట్ బ్యాంక్ సమీపంలోని చేపల మార్కెట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తారా అనంతరం మీడియాతో మాట్లాడారు. సినిమా నటులు ఎన్నికల ప్రచారం చేస్తే ప్రజలు ఓట్లు వెయ్యరని, ఆ విషయం తెలిసి వారెందుకు ప్రచారం చేస్తారో తనకు తెలీదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వ్యంగంగా మాట్లాడిన విషయంపై తారా విరుచుకుపడ్డారు.

సినిమా నటులు ఇక్కడ పుట్టినవారే అని, వేరే గ్రహం నుంచి రాలేదని, ఈ సమాజంలో వారు భాగమే అని తారా అన్నారు. అంత ఎందుకు ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి కూడా చిత్రరంగం నుంచి వచ్చారనే విషయం ఆయన తండ్రి కుమారస్వామికి గుర్తు లేదా అని తారా ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కుమారస్వామి రాజకీయాల్లోకి రాకముందు సినీ రంగంలో జీవనం ప్రారంభించారని తారా ఇదే సమయంలో గుర్తు చేశారు. కుమారస్వామి ప్రోడక్షన్ హౌస్ లో తాను పని చేశానని తారా అన్నారు. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం అనేది వారి వ్యక్తిగత విషయం అని తారా చెప్పారు.
సినిమారంగంలో ఉన్న వారు రాజకీయ పార్టీలు పెట్టారని, ముఖ్యమంత్రులు అయ్యారని, ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఆ విషయం ముఖ్యమంత్రి కుమారస్వామికి గుర్తులేనట్లు ఉందని నటి తారా విరుచుకుపడ్డారు. ఇదే సందర్బంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి అవుతారని తారా జోస్యం చెప్పారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications