41 ఏళ్లకే 16వేలకుపైగా హార్ట్ ఆపరేషన్లు చేశారు: అదే గుండెపోటుతో డాక్టర్ గౌరవ్ గాంధీ మృతి

గాంధీనగర్: ఆయన పేరు గౌరవ్ గాంధీ. ఆయన గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్. ఎన్నో వేల మందికి ఆయన గుండె ఆపరేషన్లు చేశారు. గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే, చివరకు ఆయనే అనూహ్యంగా గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి విషయం తెలుసుకుని వైద్యులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. జామ్‌నగర్‌కు చెందిన డాక్టర్ గౌరవ్ గాంధీ(41) కార్డియాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆయన గురించి తెలియనవారు ఉండరు. సుమారు 16 వేల మందికిపైగా రోగులకు ఆయన గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. కానీ, ఆయన మంగళవారం గుండెపోటుతో చనిపోయారని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. డాక్టర్ గౌరవ్ గాంధీ మృతి వార్త రోగులు, ఆస్పత్రి వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

famous Gujarat cardiologist

సోమవారం రాత్రి వరకు ఆస్పత్రిలో పేషెంట్లను చూసి.. జామ్ నగర్ ప్యాలెస్ రోడ్డులోని తన ఇంటికి వచ్చారు డాక్టర్ గౌరవ్. రోజు మాదిరిగానే డిన్నర్ చేసి రాత్రి 11 గంటల సమయంలో నిద్ర పోయారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు లేచి వాకింగ్ కు వెళ్లే డాక్టర్ గౌరవ్.. జూన్ 7వ తేదీ మంగళవారం ఉదయం నిద్ర లేవలేదు. బయట వర్షం పడుతుండటంతో.. నిద్ర లేవలేదని భావించిన కుటుంబ సభ్యులు.. అతన్ని డిస్ట్రబ్ చేయలేదు. అయితే, ఉదయం 7 గంటల తర్వాత కూడా నిద్ర లేవకపోవటంతో.. ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆయనను లేపే ప్రయత్నం చేశారు. ఉలుకూ పలుకూ లేకపోవటంతో.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.

famous Gujarat cardiologist

అయితే, అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. దీంతో కన్నీటిపర్యంతమయ్యారు ఆయన కుటుంబసభ్యులు. రాత్రి పడుకునే మందు అందరితో మాట్లాడారని.. ఎలాంటి అనారోగ్యం అని చెప్పలేదని గుర్తు చేసుకున్నారు. 41 ఏళ్ల వయస్సుకే 16 వేల గుండె ఆపరేషన్లను విజయవంతంగా చేసిన డాక్టర్ గౌవర్ ఇక లేరన్న విషయం తెలిసి జామ్ నగర్‌లోని డాక్టర్లతోపాటు.. ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అతి చిన్న వయస్సులోనే ప్రముఖ కార్డియాలజిస్ట్‌గా పేరు పొందిన గౌరవ్.. అదే గుండెపోటుతో చనిపోవటం వైద్యలోకాన్ని షాక్‌కు గురి చేసింది. సోషల్ మీడియా వేదికగా డాక్టర్ గౌరవ్‌కు వైద్యులు, ప్రజలు నివాళులర్పించారు. గుండె జబ్బులపై ఇటీవల కాలంలో గౌరవ్ అనేక అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారని ఆయన వద్ద చికిత్స పొందినవారు గుర్తు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+