హృదయ విదారకం: మెడికల్ కాలేజీలో భారీ అగ్ని ప్రమాదం, 10 మంది శిశువులు సజీవ దహనం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో శుక్రవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది చిన్నారులు మృతి చెందగా, మరో 32 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని, ఆ సమయంలో చనిపోయిన పిల్లలు ఇంక్యుబేటర్లలో ఉన్నారని జోన్ కాన్పూర్ ఏడీజీ అలోక్ సింగ్ ధృవీకరించారు.
ఈ అగ్ని ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి 12 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషనర్, డీఐజీని సీఎం యోగి ఆదేశించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు.

ఝాన్సీ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీలోని ఎన్‌ఐసీయూలో జరిగిన ప్రమాదంలో చిన్నారులు మృతి చెందడం చాలా బాధాకరం. హృదయ విదారకంగా ఉందని, సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులను ఆదేశించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మరణించిన వారికి మోక్షం కలగాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
Terrible news from Jhansi, Uttar Pradesh. 10 newborns dead in a massive that fire broke out in NICU of Maharani Laxmibai Medical College. Tragedy occurred on Friday night in the Pediatric Ward (SNCU). Six fire brigade vehicles are at the scene and 40 children have been rescued. pic.twitter.com/qNSls5fbY1
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 15, 2024
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనలను అనుసరించి, పరిస్థితిని పర్యవేక్షించడానికి ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఝాన్సీకి పంపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి 12 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషనర్, డీఐజీని సీఎం యోగి ఆదేశించారు. మరోవైపు, చిన్నారులు మృతి చెందడటంతో వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తిగా కాలిపోయిన శిశువుల మృతదేహాలను తీసుకొస్తున్న వీడియోలు అక్కడి హృదయ విదారక పరిస్థితిని తెలియజేస్తున్నాయి.
10 infants charred to death in NICU of Jhansi medical College.https://t.co/ETYtRqR3mj pic.twitter.com/7GjVH9Y4pn
— Arvind Chauhan, very allergic to 'ya ya'. (@Arv_Ind_Chauhan) November 15, 2024
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications