ఉన్నావ్ బాధితురాలి తండ్రిపై దాడి, అంకుల్, పదేళ్ల చిన్నారికి బెదిరింపులు, ప్రియాంకగాంధీ
ఉన్నావ్ యువతిపై సాముహిక లైంగికదాడికి పాల్పడిన దుండగులు.. ఆమె కుటుంబాన్ని కూడా హింసించారు. గతేడాది డిసెంబర్‌లో దారుణానికి ఒడిగట్టిన నిందితులు, అప్పటినుంచి కుటుంబసభ్యులను కూడా బెదిరిస్తున్నారు. శనివారం వారిని పరామర్శించే సమయంలో తమకు జరిగిన అన్యాయాన్ని తెలిపారు.
గతేడాది డిసెంబర్‌లో బాధితురాలిపై లైంగికదాడి చేశారు. తర్వాత కేసు నమోదు చేశారు. ఇటీవల రాయ్ బరేలి కోర్టుకు సాక్ష్యం చెప్పేందుకు వెళ్తుండగా నిలువరించి, దాడి చేసిన సంగతి తెలిసిందే. తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించడంతో 90 శాతం గాయాలతో యువతి ఆస్పత్రిలో చేరింది. లక్నో నుంచి ఢిల్లీ తీసుకొచ్చిన ప్రయోజనం లేకపోయింది.

బాధితురాలి కుటుంబసభ్యులను కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ పరామర్శించారు. నిందితులు ఏడాది నుంచి తమను వేధిస్తున్నారని వారు పేర్కొన్నారు. యువతి తండ్రిపై చేయి చేసుకున్నారని తెలిసింది. ఆమె చినాన్న, పదేళ్ల వయస్సున్న చిన్నారిని బెదిరింపులకు గురిచేశారని ప్రియాంకకు వివరించారు. తమను వారు వేధిస్తున్న పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని వాపోయారు. యువతి కుటుంబానికి పోలీసులు భద్రత కల్పించకపోవడాన్ని ప్రియాంక తప్పుపట్టారు. ఉన్నావ్‌లోనే బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సెంగార్ మరో యువతిపై లైంగికదాడి చేసిన సంగతి తెలిసిందే.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications