Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lockdown: భార్య రాసలీలలు చూడలేక, వినేరకం కాదు, వీడియో తీసి కుమార్తెను చంపి భర్త ఆత్మహత్య !

బెంగళూరు/రామనగర్: భార్య అక్రమ సంబంధంతో భర్త విసిగిపోయాడు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటున్న భర్త పరాయి వ్యక్తులతో అతని భార్య రాసలీలలు చూడలేక మరింత జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. భార్య ఎంత చెప్పినా మాట వినేరకం కాదని, ఆమె కారణంగా కుటుంబ సభ్యులు దూరం అయ్యారని భర్త ఆవేదన చెందాడు, భార్య అక్రమ సంబంధాన్ని ఇంట్లోనే ఉంటున్న భర్త జీర్ణించుకోలేకపోయాడు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ భార్య చేష్టలతో విసిగిపోయిన భర్త సెల్ఫీ వీడియో తీసి ఆయన మనసులోని భాద మొత్తం చెప్పుకుని తరువాత కుమార్తెను హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కుమార్తె, భర్త ఆత్మహత్యలకు పరోక్షంగా కారణం అయిన భార్య ప్రస్తుతం పరారైయ్యింది.

 భార్య, కూతురు

భార్య, కూతురు

కర్ణాటకలోని రామనగర తాలుకా తటమానదొడ్డి గ్రామంలో రామచంద్ర (36) అనే వ్యక్తి భార్య, 7 ఏళ్ల కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. రామచంద్ర డ్రైవర్ గా పని చేస్తూ భార్య, కుమార్తెను పోషించుకుంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలల నుంచి రామచంద్ర పనికి వెళ్లకుండ ఇంట్లోనే ఉంటున్నాడు.

 భార్య అక్రమ సంబంధంతో విసిగిపోయాడు

భార్య అక్రమ సంబంధంతో విసిగిపోయాడు

రామచంద్ర లాక్ డౌన్ సందర్బంగా ఇంట్లోనే ఉండటంతో ఆయన భార్య విసిగించుకోవడం మొదలు పెట్టింది. మొదటి నుంచి భార్య తీరుపై, ఆమె అక్రమ సంబంధాలపై రామచంద్ర కోపంగానే ఉంటున్నాడు. అయితే ఇన్ని రోజులు సర్దుకుని వెళ్లాడు. ఐదు రోజుల క్రితం రామచంద్ర భార్య చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయిందని సమాచారం. లాక్ డౌన్ కారణంగా భార్య తీరుపై మరింత విసిగిపోయిన రామచంద్ర జీవితంపై విరక్తి పెంచుకున్నాడు.

 సెల్ఫీ వీడియో తీసి !

సెల్ఫీ వీడియో తీసి !

రామచంద్ర రాత్రి ఓ సెల్ఫీ వీడియో తీశాడు. ఈ వీడియోలో అన్నను ఉద్దేశించి రామచంద్ర మాట్లాడాడు. నా భార్యను నమ్ముకుని మన తల్లిదండ్రులతో పాటు మిమ్మల్ని దూరం చేసుకున్నానని బోరున విలపించాడు. మీరు దూరం అయిన కనీసం నాకు నా భార్య దగ్గర కావడం లేదని, ఆమె తీరుతో, అక్రమ సంబధాలతో తనకు జీవితంపై విరక్తి పెరిగిపోయిందని, తాను ఆత్మహత్య చేసుకుంటే నా కూతురు దిక్కులేనిది అయిపోతుందని రామచంద్ర సెల్ఫీ వీడియోలో విలపించాడు. అన్న నువ్వు అమ్మా, నాన్నను జాగ్రత్తగా చూసుకో, ఈ జీవితంలో మీతో నాకు రుణం తీరిపోయింది అంటూ రామచంద్ర విలపించాడు.

 నా భార్యను వదిలేయండి

నా భార్యను వదిలేయండి

తన భార్య అక్రమ సంబంధాల విషయంలో ఆమె పద్దతి మార్చుకోదని తెలుసుకున్నా, నా కూతురిని పెద్ద చేసి పెళ్లి చేసి ఆమె ఎదుగుదల చూడాలని ఎంతో ఆశపడ్డాను. అయితే తన భార్య తీరుతో అది సాధ్యం కాదని తెలిసిపోయింది. మేము ఆత్మహత్య చేసుకున్న తరువాత నా భార్యను ఏమీ అనకుండా ఆమెను వదిలేయండి, నా భార్యకు ఆమె సుఖం ముఖ్యం, అందుకు మేము అడ్డుగా ఉన్నాం అంటూ రామచంద్ర సెల్ఫీ వీడియోలో విలపించాడు.

కూతురు, భర్త ఆత్మహత్యలతో భార్య ఎస్కేప్

కూతురు, భర్త ఆత్మహత్యలతో భార్య ఎస్కేప్

బుధవారం అర్దరాత్రి అన్నకు సెల్ఫీ వీడియో పంపించిన రామచంద్ర కుమార్తెకు ఉరి వేసి హత్య చేసి తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రామచంద్ర కుటుంబ సభ్యులు వెళ్లి చూసే సరికి ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రామచంద్ర, కూతురు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసినా భార్య మాత్రం రాలేదు. రామచంద్ర భార్య ప్రస్తుతం ఎస్కేప్ అయ్యింది. రామనగర గ్రామీణ పోలీసులు రామచంద్ర సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+