షేమ్: సెక్యూరిటీతో చెప్పులు మోయించిన లేడీ కలెక్టర్!

Subscribe to Oneindia Telugu

రాయ్‌పూర్: ఆమె ఓ జిల్లాకు కలెక్టర్. ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సిన ఆమె.. ఇప్పుడు నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ఓ గ్రామాన్ని సందర్శించే సమయంలో బురదలో నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఆమె చెప్పులను కూడా సెక్యూరిటీచేత మోయించింది. ఆమే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కన్కెర్ జిల్లా కలెక్టర్ షమ్మీ అబీది. కాగా, ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ అయింది.

వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లారు షమ్మీ అబీది. అయితే ఆ ప్రాంతానికి వెళ్లేందుకు అనికట్ డ్యాంను దాటే క్రమంలో కొటారి నది దాటాలి, బురదలో నడవాల్సి ఉంటుంది. అక్కడి అధికారులతో పాటు, ప్రజలు కూడా ఆమెతో వచ్చారు. వరద ప్రాంతాలను సందర్శించడానికి ఇంత కష్టపడి మరీ ధైర్యంగా వచ్చిందని అందరూ గొప్పగా చెప్పుకున్నారు.

అయితే ఇంతలోనే విమర్శలు వచ్చేలా వ్యవహరించారు ఆ యువ కలెక్టర్. ఆ సమయంలో ఆమెను చూడగానే ఒక్కసారిగా అక్కడి వారందరూ షాకయ్యారు. ఆమె వెనకనే ఉన్న ఓ సెక్యూరిటీ గాడ్ చేతిలో అతని చెప్పులతో పాటు ఆమె చెప్పులు కూడా ఉన్నాయి. దీంతో అందరూ ఆమె తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

Female collector makes security guard hold chappals while river-crossing, gets trolled online!

కాగా, అందులో ఒకరు ఫొటో తీసి నెట్‌లో పెట్టగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కలెక్టర్ అయితే మాత్రం ఇలా చేస్తారా ! అంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు షమ్మీ. అయితే తర్వాత మీడియాతో మాట్లాడిన సదరు కలెక్టర్ బురదగా ఉండటంతో తన చెప్పులను పైలెట్ వాహనంలో వదిలేశానని చెప్పారు. కానీ సెక్యూరిటీ గార్డ్ వాటిని తన వెనకనే మోసుకొస్తున్న విషయం తనకు తెలియదని చెప్పడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The collector of Chattishgarh Shammi Abidi who is a young IAS officer perhaps thought it would be brave to cross a river to reach out to villagers in the area who had some grievances.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి