పెళ్లిలో కొట్లాట.. అడిగినంత డబ్బు ఇవ్వలేదని పెళ్లికొడుకును పిచ్చికొట్టుడు

మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. ఈ పెళ్లి తంతుతో ఏకవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవతాయి. అందుకే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి అయినా కానీ మంచి సంబంధం ఫిక్స్ చేసుకుంటారు. అంతే కాకుండా పెళ్లి విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్దతి ఉంటుంది.

ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వంలో జీవిస్తున్న ఈ భారతదేశంలో అందరం కలిసి ఉండడమే గొప్ప విషయంగా చెబుతారు. ఇంతటి జనాభాలో కూడా ప్రజలు ఎవరి పద్దతులను వారు అనుసరిస్తూ ఉంటారు. అయితే ఈ పద్దతుల కారణంగానే ఓ పెళ్లి వేడుకలో కొట్లాట చోటు చేసుకుంది. పెళ్లి అన్నాక అనేక ఆచారాలు, సంప్రదాయాలు, సరాదాలు, ఆటాపాటా.. ఇలా ఒక్కటేంటి? అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఇక నూతన దంపతుల్ని స్నేహితులు గానీ.. బంధువులు గానీ ఆట పట్టించే కార్యక్రమాలు కూడా ఉంటాయి.

fight-at-wedding-for-not-giving-money-at-uttar-pradesh

అయితే ఏదైనా కానీ హద్దుల్లో ఉంటే పర్వాలేదు.. శృతిమించితే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు. ఓ ఊహించని ఘటనతో వరుడు తరపు, వధువు తరపు వారు ఘర్షణకు దిగడమే కాకుండా ఏకంగా పెళ్లి కొడుకుని సైతం ఓ గదిలో బంధించి కర్రలతో కొట్టిన ఘటన తీవ్ర సంచలనంగా మారుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరాఖండ్‌కు చెందిన షబీర్ అనే యువకుడికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతితో గత శనివారం నాడు వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లి తర్వాత వివాహ ఆచారాల ప్రకారం చెప్పులు దాచడం అనే కార్యక్రమం జరగడం సహజమే. అందులో భాగంగానే వధువు కుటుంబ సభ్యులు.. వరుడి చెప్పులు దాచి పెట్టారు. తిరిగి ఇవ్వాలంటే రూ.50 వేలు ఇవ్వాలని సరదాగా ఆటా పట్టించి డిమాండ్ చేశారు. అందుకు వరుడు అంతా కాదు అంటూ రూ.5 వేలు ఇచ్చాడు.

అయితే వధువు బంధువులు అందుకు అభ్యంతరం చెబుతూ.. 'బిచ్చగాడు' అంటూ విమర్శించారు. దాంతో వరుడి బంధువులకు కోపం వచ్చి ఎదురు తిరిగారు. మాట మాట పెరగడంతో ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగారు. అనంతరం వరుడిని గదిలో బంధించి కర్రలతో కొట్టారు. అంతటితో ఆగకుండా ఒకరిపై మరొకరు ఏకంగా పోలీస్ కేసులు కూడా పెట్టుకున్నారు. ఇక పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చి సర్ది చెప్పి పంపించేయడంతో అంతా సర్దుమనిగిందని ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+