surrender: హత్య కేసులో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన సినిమా ఫైనాన్షియర్, శవం కాల్చేసి !

ఇద్దరు అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఫైనాన్స్ వ్యాపారి తాను ఓ వ్యక్తిని చంపేశానని, శవం మీద పెట్రోల్ పోసి నిప్పంటించానని చెప్పడంతో పోలీసులు హడలిపోయారు.

చెన్నై/టీనగర్: సినిమా నిర్మాతలకు సినిమాలు తియ్యడానికి వారితో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి లోకల్ గా కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. వడ్డీ వ్యాపారి దగ్గర చాలా మంది కలెక్షన్ ఏజెంట్లు ఉద్యోగం చేస్తున్నాడు. సినిమా రంగంలో ఆ ఫైనాన్స్ వ్యాపారికి మంచి పలుకుబడి ఉంది. ఇద్దరు అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఫైనాన్స్ వ్యాపారి తాను ఓ వ్యక్తిని చంపేశానని, శవం మీద పెట్రోల్ పోసి నిప్పంటించానని చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. సినిమా ఫైనాన్స్ వ్యాపారి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి హత్య కేసులో లొంగిపోవడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

తమిళ సినిమాలకు ఫైనాన్స్ ఇస్తున్నాడు

తమిళ సినిమాలకు ఫైనాన్స్ ఇస్తున్నాడు


చెన్నైలో నోలంపూర్ లో చోటా వెంకట్రామన్ నివాసం ఉంటున్నాడు. చోటా వెంట్రామన్ సినిమా ఫైనాన్షియర్ గా వ్యాపారం చేస్తున్నాడు. వెంకట్రామన్ బయట వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులతో కలిసి నోలంపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వెంకట్రామన్ లొంగిపోయాడు. అనంతరం తన వద్ద పనిచేసిన బాబును తాను హత్య చేశానని, శవాన్ని తగులబెట్టానని, లొంగిపోయేందుకు వచ్చానని వెంకట్రామన్ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

 ఇది జరిగిన స్టోరి

ఇది జరిగిన స్టోరి

హడలిపోయిన పోలీసులు ఏం జరిగిందో చెప్పాలని వెంకట్రామన్ ను విచారించారు. పోలీసుల విచారణలో హడలిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం హత్యకు గురైన బాబు చెన్నైలోని అయనంబాక్కం ప్రాంతానికి చెందినవాడు. గత కొంతకాలంగా ఫైనాన్షియర్ వెంకట్రామన్ వద్ద బాబు కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. పనిలో ఉండగా వెంకటరమణ వద్ద బాబు రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. యజమాని ఇంట్లో చిన్నచిన్నగా 21 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా బాబు చోరీ చేశాడు.

 భయపడి మాయం అయ్యాడు

భయపడి మాయం అయ్యాడు

విషయం తెలుసుకున్న వెంకట్రామన్ డబ్బులు, నగలు తిరిగి ఇవ్వాలని చెప్పాడు. డబ్బులు, నగలు ఇవ్వకుండా చోటా వెంకట్రామన్ గురించి అతని పరువు పోయేలా బాబు తప్పుడు ప్రచారం చేశాడు. దీనిపై చోటా వెంకట్రామన్ నాలుగు నెలల క్రితం నోలంపూర్ పోలీస్ స్టేషన్‌లో బాబు మీద ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఇద్దరినీ పిలిపించి శాంతియుతంగా చర్చలు జరిపి డబ్బులు తిరిగి ఇవ్వాలని బాబుకి చెప్పారు. డబ్బులు చెల్లించకుండా బాబు పరారైనాడు.

రాత్రి చిక్కిపోయిన బాబు

రాత్రి చిక్కిపోయిన బాబు

శుక్రవారం రాత్రి కోయంబేడు బస్ స్టేషన్ ముందు నిలబడిన బాబును వెంకట్రామన్ అనుచరుడు నవీన్ చూశాడు. అనంతరం బాబును కారులో కిడ్నాప్ చేసి నోలంపూర్‌లోని ఎస్‌బీ గార్డెన్‌లోని చోటా వెంకట్రామన్ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఇంట్లోని 2వ అంతస్తులోని ప్రత్యేక గదిలో బాబును బంధించి అతన్ని నగ్నంగా చేసి ఇనుప రాడ్‌తో చిత్రహింసలకు గురిచేశారు. డబ్బు కోసం రాత్రంతా చిత్రహింసలకు గురిచెయ్యడంతో బాబు చనిపోయాడు.

పెట్రోల్ పోసి శవం కాల్చేశాడు

పెట్రోల్ పోసి శవం కాల్చేశాడు


హత్యను కప్పిపుచ్చేందుకు ప్లాన్ వేసిన చోటా వెంకట్రామన్ వెంటనే బాబు మృతదేహాన్ని పార్శిల్ చేసి కారులో తీసుకెళ్లాడు. బాబు మృతదేహాన్ని కీలప్పాక్కం ప్రాంతంలోని చెత్తకుప్పలు వేసే డంప్ లో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఎలాగైనా పోలీసులకు పట్టుబడతాడేమో అనే భయంతో చోటా వెంకట్రామన్ అతని లాయర్లతో కలిసి నోలంపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

ఎంతపని జరిగింది

ఎంతపని జరిగింది

బాబును హత్య చేసి మృతదేహాన్ని దాచిపెట్టడంలో సహకరించిన దిలీప్, శరవణన్, గోపాల్ కూడా పోలీసుల ముందు లొంగిపోయారు. అనంతరం నలుగురిని నోలంపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే స్నిఫర్ డాగ్స్ తో కీలప్పాకం ప్రాంతానికి వెళ్లిన పోలీసులు సగం కాలిన బాబు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కీలప్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ హత్య కేసులో పరారీలో ఉన్న నవీన్ కోసం చెన్నై పోలీసులు గాలిస్తున్నారు. కలెక్షన్ ఏజెంట్ హత్య కేసులో సినిమా ఫైనాన్సియర్ వెంకట్రామన్ పోలీస్ స్టేషన లో లొంగిపోవడం చెన్నైలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+