మీ పార్టనర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారో లేదో ఇలా కనిపెట్టండి..!

దాంపత్య జీవితం లో అసంతృప్తి ఉంటే ఆ దంపతులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది. వివాహం తర్వాత సంతృప్తికరమైన అనుబంధం లేకపోవడం, ఆకర్షణ తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యక్తులు కొత్త సంబంధాల కోసం వెతుకుతారు. దాంపత్య జీవితం పట్ల నిరాసక్తత, విసుగు ఉన్నప్పుడు వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షితులను చేస్తుంది. ప్రస్తుతం ఈ వివాహేతర సంబంధాలు చాలా సులభంగా పెరిగిపోతున్నాయి.

పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దంపతులు వైవాహిక జీవితానికి సరైన గౌరవం ఇవ్వకపోవడం, సంస్కృతిని పక్కనపెట్టడం కూడా ఇందుకు కారణమౌతుంది. మీ జీవిత భాగస్వామి వివాహేతరంలో ఉన్నారని నిర్ధారించుకోవడానికి చాలా పద్దతులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ధారణకు రావడానికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను ఓసారి పరిశీలిస్తే..

Find out if your partner is having an affair

సాధారణంగా కనిపించే సంకేతాలు
ఫోన్‌ను ఎప్పుడూ మీకు దూరంగా ఉంచడం, పాస్‌వర్డ్‌లు పెట్టడం, కాల్స్‌ మరియు మెసేజ్‌లను రహస్యంగా ఉంచడం.ఇంతకు ముందు చేసే వ్యక్తిగత కార్యకలాపాలకు తక్కువ సమయం కేటాయించడం.ఒంటరిగా గడిపే సమయం పెరగడం.సాధారణంగా చూపించే ప్రేమ, శ్రద్ధ తగ్గడం.తరచుగా కోపం, ఆందోళన, నిరాశ వంటి భావోద్వేగాలను ప్రదర్శించడం.నిద్ర లేకపోవడం, ఆహారం తీసుకోవడంలో మార్పులు.తనను తాను చూసుకోవడం మానేయడం.ఇంటి పనుల్లో పాల్గొనకపోవడం.కొత్త స్నేహితులను చేసుకోవడం, పాత స్నేహితులతో సంబంధాలు తెగడం.ఖర్చులు పెరగడం, ఆదాయం గురించి నిజం చెప్పకపోవడం.వంటి మార్పులు కనిపిస్తే మీ భాగస్వామిని అనుమానించవచ్చు.

ఏమి చేయాలి
మీ అనుమానాలను నిర్ధారించడానికి ప్రయత్నించండి. ఫోన్ బిల్లులు, సోషల్ మీడియా చాట్‌లు వంటివి సాక్ష్యంగా ఉపయోగపడతాయి.ఈ విషయంలో తొందరపడకండి. సమయం తీసుకొని అన్ని కోణాల నుండి విషయాన్ని పరిశీలించండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా కౌన్సెలర్‌తో మాట్లాడడం మంచిది. మీ భాగస్వామితో ఈ విషయం గురించి మాట్లాడండి. ఒకవేళ మీ అనుమానాలు నిజమైతే, మీ సంబంధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని గురించి నిర్ణయం తీసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+