Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీటీవీ దినకరన్ కోసం బెంగళూరుకు ఢిల్లీ పోలీసులు: అరెస్టుకు రంగం సిద్దం!

టీటీవీ దినకరన్ మీద కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆయన్ను ఎలా అరెస్టు చెయ్యాలి అంటూ బెంగళూరు అధికారులతో సంప్రదిస్తున్నారు. బెంగళూరులోనే దినకరన్ అరెస్టు చేసి తీసుకు వెళ్లాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించ

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కేసుల భయంతో ఆందోళన చెంది చెన్నై నుంచి మాయం అయ్యారని వెలుగు చూసింది. కేవలం చిన్నమ్మ (శశికళ నటరాజన్) కలవడానికి బెంగళూరు వెలుతున్నానని చెప్పిన టీటీవీ దినకరన్ వేరే ప్లాన్ లో చిన్నగా జారుకున్నారని సమాచారం.

టీటీవీ దినకరన్ కు ఇప్పుడు అరెస్టు భయం పట్టుకుంది. నన్ను ఎవ్వరూ కాపాడలేరని తెలుసుకున్న దినకరన్ చిన్నగా బెంగళూరు జైల్లో ఉన్న చిన్నమ్మను కలవడానికి వెలుతున్నానని అందరికి మస్కా కొట్టి చెన్నై నుంచి చిన్నగా జారుకున్నారని వెలుగు చూసింది.

బెంగళూరు చేరుకున్న ఢిల్లీ పోలీసులు

బెంగళూరు చేరుకున్న ఢిల్లీ పోలీసులు

దినకరన్ కచ్చితంగా బెంగళూరు వస్తున్నాడని తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు అతన్ని అక్కడే అరెస్టు చెయ్యలని నిర్ణయించారు. ఇప్పటికే ఎఫ్ ఐఆర్ తయారు చేసిన పోలీసు అధికారులు బెంగళూరు చేరుకుని టీటీవీ దినకరన్ ను అరెస్టు చెయ్యడానికి సిద్దం అయ్యారు.

వదిలే ప్రసక్తే లేదు

వదిలే ప్రసక్తే లేదు

ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన టీటీవీ దినకరన్ ను వదిలే ప్రసక్తేలేదని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. ఇప్పటికే దినకరన్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉంది.

ఏం చెయ్యమంటారు చిన్నమ్మ

ఏం చెయ్యమంటారు చిన్నమ్మ

తమిళనాడులో మన ప్రభుత్వం అధికారంలో ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన టీటీవీ దినకరన్ ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక తన చిన్నమ్మ శశికళ సలహా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే దినకరన్ అరెస్టును మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరని సమాచారం.

ఇక ఒక్కటే దారి

ఇక ఒక్కటే దారి

టీటీవీ దినకరన్ అరెస్టు గ్యారెంటీ అని తెలుసుకున్న శశికళ వర్గంలోని నాయకులు వేరే తలుపులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే పన్నీర్ సెల్వం వర్గీయులు దినకరన్ ఆచూకి కోసం ఆరా తీస్తున్నారు.

ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ !

ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ !

ఒక్క చాన్స్ ఇస్తే మీకే మద్దతు ఇస్తామని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి మంత్రి వర్గంలోని సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వర్గీయులకు మంతనాలు పంపిస్తున్నారు. అయితే ఈ సందర్బంలో పన్నీర్ సెల్వం వర్గీయులు ఆచీతూచి అడుగులు వేస్తున్నారు.

శశికళ వర్గీయుల్లో ఆందోళన

శశికళ వర్గీయుల్లో ఆందోళన

శశికళ వర్గంలోని నాయకులు ఇప్పుడు ఆందోళనకు గురైనారు. ఎలాగైనా దినకరన్ ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. దినకరన్ ఇదే పదవిలో ఉంటే లేనిపోని సమస్యలు వెంటాడుతుంటాయని ఎడప్పాడి పళనిసామి వర్గీయులు పసిగట్టారు.

వస్తాం ఉండండి సర్

వస్తాం ఉండండి సర్

దినకరన్ ప్రవర్తనతో విసిగిపోయిన శశికళ వర్గీయులు ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గీయుల వైపు చూస్తున్నారు. సర్ ఒక్క చాన్స్ ఇవ్వండి, మేము మళ్లీ మీకే మద్దతు ఇస్తామని రాయబారం పంపిస్తున్నారు. ఎలాగైనా దినకరన్ గ్రూప్ నుంచి తప్పించుకుని బయటపడాలని ఎమ్మెల్యేలు స్కెచ్ వేస్తున్నారని సమాచారం.

చూద్దామా లేక ఓకే నా ?

చూద్దామా లేక ఓకే నా ?

శశికళ వర్గంలోని సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు వస్తే కచ్చితంగా ఆహ్వానించాలని ఇన్ని రోజులు వేచి చూసిన పన్నీర్ సెల్వం వర్గీయులు ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. శశికళ వర్గంలోని కొందరిని మినహాయించి అందరినీ తమ వర్గంలోకి తీసుకోవాలని పన్నీర్ సెల్వం వర్గం భావిస్తోందని సమాచారం.

దినకరన్ మీద అనేక కేసులు

దినకరన్ మీద అనేక కేసులు

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ మీద ఢిల్లీ పోలీసులు ఐపీసీ 170. 120, 8 పీఓసీ తదితర సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. ఏకంగా ఎన్నికల కమిషన్ అధికారులకే లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన టీటీవీ దినకరన్ అంత సామాన్యంగా ఈ కేసు నుంచి బయటపడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+