వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులకు, మావోయిస్టులకు కాల్పులు, ఏడుగురు మావోల మృతి

|
Google Oneindia TeluguNews

బస్తర్ : పోలీసులకు మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్ గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. వారు తారసపడటంతో కాల్పులు ప్రారంభమయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

బస్తర్ జిల్లా జగదల్ పూర్‌లో సాయంత్రం ఎదురుకాల్పులు జరిగాయి. తిరియా గ్రామ సమీపంలో ఇరువర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే భద్రతాదళాలు మెరుపుదాడి చేయడంతో .. మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగలింది. మావోయిస్టులు నక్కి ఉన్నారనే సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డ్, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు కనిపించిన వెంటనే కాల్పులు ప్రారంభించాయి.

fire exchange on police mavoist

దీంతో ఇరు వర్గాలు కాల్పులు జరుపడంతో ఆ ప్రాంతమంతా తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది. కాల్పులు ముగిసిన తర్వాత ఘటనాస్థలం నుంచి పోలీసులు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని గుర్తించాల్సి ఉంది. భారీగా ఆయుధాలను కూడా లభించినట్టు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. బస్తర్‌లో కాల్పులతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. ఎన్ కౌంటర్ తర్వాత పోలీసులు తనిఖీలను విసృతం చేశారు. రహదారి గుండా వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

English summary
Seven Maoists have been killed in police firing. The Maoists were seriously injured in the firing in Bastar district of Chhattisgarh. The police were conducting comb with information that the Maoists were present.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X