Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముచ్చటగా మూడోసారి .. ప్రధానిగా మోదీ 3.o.. ముహూర్తం ఫిక్స్!!

భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ మూడోసారి అధికారంలోకి రానుంది. ఈనెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నారు.

ముచ్చటగా మూడోసారి ఎన్డీయే సర్కార్
ముచ్చటగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికలలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎన్డీయే మోడీకి మళ్లీ పట్టం కట్టనుంది. ఈ క్రమంలో జూన్ 8వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

For the third time Modi as Prime Minister 3 o date and time fixed for oath taking ceremony

మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ప్రముఖులు
ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాత్రమే కాదు బీహార్ జేడీయూ అధినేత నితీష్ కుమార్, కూటమి నేతలతో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. నిన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో ఎన్డీయే కూటమి పార్టీలకు అధికారం చేపట్టడానికి కావాల్సిన ఆధిక్యం రావడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు కార్యక్రమం మొదలు పెట్టింది.

మెజారిటీ మార్క్ దాటటంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు
ఎన్డీఏ కూటమి 292సీట్లు సాధించి మెజారిటీ మార్క్ దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. 543సీట్లున్న లోక్ సభ అధికారం చేపట్టాలంటే 272 సీట్లు సాధించాలి. ఎన్టీఏ కూటమి పార్టీలన్నీ కలిపి మెజారిటీని దాటడంతో ప్రభుత్వ ఏర్పాటు ఈజీ అయింది. మూడోసారి మోడీ 3.0 సర్కార్ మళ్లీ అధికారంలోకి రానుంది. కౌంటింగ్ సమయంలో ఒక దశలో అధికారం సాధించే మెజార్టీపై కాస్త ఆందోళన కలిగింది. అయినా మళ్ళీ కూటమి పుంజుకుంది.

నేడు సాయంత్రం ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే కూటమి సమావేశం
ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న కూటమి సమావేశానికి ఎన్డీయే కూటమిలోని సీనియర్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ నేతలు ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. జెడియు అధినేత నితీష్ కుమార్ తో పాటు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాట్లలో ఈసారి కీలకం కానున్నారు. ఈ క్రమంలో నేడు సాయంత్రం జరగనున్న సమావేశంపై ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+