వీడియో కలకలం: పోలీస్ స్టేషన్‌పై విదేశీ జంట శృంగార కార్యకలాపాలు!
ఉదయ్‌పూర్: ఓ పోలీస్ స్టేషన్ భవనంపై విదేశీ జంట ఏకాంతంగా గడిపిన వీడియో ఇప్పుడు రాజస్థాన్‌లో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏకంగా పోలీస్ స్టేషన్ భవనంపైనే బహిరంగంగా ఇలా రొమాన్స్ చేసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఉదయ్‌పూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు.

స్థానిక ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయ్‌పూర్ పరిధిలోని ఘంటానగర్ పోలీస్ స్టేషన్ మీద కొద్ది రోజుల కిందట విదేశానికి చెందిన ఓ జంట శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట నిజమే కానీ, ఇది ఎక్కడ జరిగింది? ఎవరైనా మార్ఫింగ్ చేసి ఇలా చేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని ఎస్పీ వెల్లడించారు.
పోలీస్ స్టేషన్‌పై ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేదని ఆయన అన్నారు. కాగా, ఆ పోలీస్ స్టేషన్‌పైనే ఈ అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని స్థానికులు చెబుతుండటం గమనార్హం.
అంతేగాక, పోలీస్ స్టేషన్ లోపలి నుంచే టెర్రాస్ మీదకు వెళ్లేందుకు వీలుందని చెబుతున్నారు. అంటే విదేశీ జంటకు స్టేషన్లోని పోలీసులే సహకరించివుంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications