బెంగళూరు హోటల్ రూమ్ లో విదేశీ మహిళ ?, టూరిస్టు వీసాతో వచ్చి, ఏం జరిగింది !

టూరిస్టు వీసాతో భారత్ కు వచ్చిన మహిళ ఐటీ హబ్ లోని పర్యాటక ప్రాంతాలు చూడాలని అనుకుంది. బెంగళూరులో ఓ విదేశీ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. విదేశీ మహిళను ఊపిరాడక హత్య చేసి ఉంటారని బెంగళూరు సిటీ పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విదేశీ మహిళను ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జరీనాగా గుర్తించారు.

ఈ ఘటన బెంగళూరు సిటీలోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ సమీపంలోని జగదీష్ హోటల్ లో చోటుచేసుకుంది. విదేశీ మహిళ జరీనాకు హోటల్‌లోని రెండో అంతస్తులో గది ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం జరీనా టూరిస్ట్ వీసాపై బెంగళూరు వచ్చిందని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. హోటల్ గదిలో నుంచి జరీనా బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది.

Foreign woman found dead suspiciously in Bengaluru city in Karnataka

జరీనా ఉంటున్న గది తలుపులు కొట్టిన హోటల్ సిబ్బంది తలుపులు తియ్యాలని చాలాసార్లు చెప్పారు. అయితే విదేశీ మహిళ జరీనా నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, ఆమె ఎంతసేపటికి రూమ్ లో నుంచి బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Foreign woman found dead suspiciously in Bengaluru city in Karnataka

అర్ధరాత్రి పోలీసులు మాస్టర్ కీ ఉపయోగించి గది తెరిచి చూడగా విదేశీ మహిళ జరీనా మృతదేహం లభ్యమైంది. బెంగళూరు పోలీసులు సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించి ఆధారాలు సేకరించారు. విదేశీ మహిళ జరీనాతో కలిసి బెంగళూరుకు ఎవరెవరు వచ్చారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

బెంగళూరులోని శేషాద్రిపురంలోని జగదీష్ హోటల్ లో ఏర్పాటు చేసి సీసీటీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. విదేశీ మహిళ జరీనాతో కలిసి ఆ హోటల్ రూమ్ లోకి బయట వ్యక్తులు ఎవరైనా వచ్చారా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. హెటల్ సిబ్బందిని విచారణ చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని బెంగళూరు సిటీ పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+