మాజీ ఎంపీకి షాక్, అశ్లీల వీడియోలు ఒరిజినల్, నివేదిక ఇచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ ?

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీకి సినిమా కనపడుతోంది. కర్ణాటకలోని హాసన్ మాజీ ఎంపీ, జేడీఎస్ పార్టీ బహిష్కరించిన నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ కేసు కీలక మలుపు తిరిగింది. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన లైంగిక వేధింపుల వీడియోలు నిజమైనవని అధికారుల విచారణలో రుజువు అయ్యింది.

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదిక ఆ వీడియో నిజమైనవ రుజువు చేయడం సిట్ దర్యాప్తుకు మరింత బలం చేకూర్చింది. మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇప్పుడు బెంగళూరు నగర శివార్లలోని పరప్ప అగ్రహార జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోల వాస్తవికతను ధృవీకరించేందుకు కర్ణాటక సిట్ అధికారులు ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించారు.

Forensic lab officials who reported that the obscene videos are genuine in the former MP case

ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్టు సిట్ అధికారుల చేతిలో ఉందని, వీడియోలు తారుమారు కాలేదని, అంతా వాస్తవమేనని తెలిసింది. అశ్లీల వీడియోలు అసలైనవేనని ఫోరెన్సిక్ నివేదికలో తేలిందని, అయితే ఆ వీడియో ప్రజ్వల్ రేవణ్ణ దేనా, కాదా ? అన్న కోణంలో విచారణ జరగాల్సి ఉందని, విచారణ కొనసాగుతోందని కేసు దర్యాప్తు చేస్తున్న ఓ పోలీసు అధికారి చెప్పారని ప్రముఖ కన్నడ దిన పత్రిక ప్రజావాణి పేర్కొంది.

లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అశ్లీల వీడియోల్లో వ్యక్తి ముఖం కనిపించడం లేదు. వీడియోలో ఉన్న వ్యక్తితో పోలిక, అరెస్టు అయిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై దర్యాప్తు చేస్తున్నారు. వీడియోలో ఉన్న వ్యక్తి ప్రజ్వల్ రేవణ్ణ అని సిట్ నిరూపిస్తే ఈ కేసు దర్యాప్తు ఒక దశకు చేరుకుంటుంది. ఇప్పటికే ఈ కేసుపై సిట్‌ విస్తృతంగా విచారణ చేపట్టి చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే చార్జిషీటు దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటిలో పని చేస్తున్న మహిళలపై, జేడీఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు అయ్యి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+