హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో ఈడీ సోదాలు: వాషింగ్ మెషీన్‌లో నోట్ల కట్టలు
న్యూఢిల్లీ: విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో ఈ అధికారులకు అనూహ్యంగా ఓ వాషింగ్ మెషీన్‌లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. ఈ సోదాలు వివరాలను ఈడీ అధికారులు వెల్లడించారు.
క్యాప్రికార్నియన్ షిప్పింగ్-లాజిస్టిక్స్, దాని అనుబంధ సంస్థలు.. బోగస్ సరుకు రవాణా సేవలు, దిగుమతులు తదితరాల పేరిట షెల్ కంపెనీల సాయంతో సింగపూర్ కు చెందిన రెండు సంస్థల(M/s Galaxy Shipping & Logistics Pvt Ltd, M/s Horizon Shipping & Logistics Pvt Ltd)తో రూ. 1800 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు ఈడీకి విశ్వసనీయ సమాచారం అందింది.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. క్యాప్రికార్నియన్ షిప్పింగ్-లాజిస్టిక్స్, దాని డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామిల ఇళ్లతోపాటు అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, హైదరాబాద్,
ముంబై, కోల్‌కతా నగరాలతోపాటు కురుక్షేత్ర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.
వాటి అనుబంధిత సంస్థలు M/s లక్ష్మీటన్ మారిటైమ్, M/s హిందుస్థాన్ ఇంటర్నేషనల్, M/s రాజనందిని మెటల్స్ లిమిటెడ్, M/s స్టావర్ట్ అల్లాయ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్; M/s భాగ్యనగర్ లిమిటెడ్, M/s వినాయక్ స్టీల్స్ లిమిటెడ్, M/s వశిష్ట కన్స్ట్రక్షన్స్ Pvt Ltd, వాటి డైరెక్టర్లు భాగస్వాములు సందీప్ గార్గ్, వినోద్ కేడియా.
ED has conducted searches under the provisions of FEMA,1999 at the premises of M/s. Capricornian Shipping & Logistics Pvt Ltd and its directors Vijay Kumar Shukla and Sanjay Goswami and associated entities M/s. Laxmiton Maritime, M/s. Hindustan International, M/s. Rajnandini… pic.twitter.com/0EDzrjrlRJ
— ED (@dir_ed) March 26, 2024
ఈ సందర్భంగా రూ. 2.54 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇందులో కొంత మొత్తం వాషింగ్ మెషీన్‌లో దొరికిందని ఈడీ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోను కూడా ఈడీ ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేసింది. ఈ సోదాల్లో వివిధ పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, మొత్తం 47 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశామని వెల్లడించింది. కాగా, సోదాలు ఎప్పుడు జరిగాయి? ఆ నగదు ఎక్కడ పట్టుబడిందనే విషయాలను మాత్రం ఈడీ వెల్లడించలేదు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications