ప్రధాని మొరపెట్టుకున్నా వెళ్లే ప్రసక్తేలేదు, నేను ఏమిటో చూపిస్తా, మాజీ సీఎం చాలెంజ్ !
బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తనను నమ్మించి మోసం చేసిన బీజేపీకి తగిన బుద్ది చెప్పాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ డిసైడ్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ తనను మళ్లీ బీజేపీలోకి ఆహ్వానించినా తాను మాత్రం ఆ పార్టీలోకి వెళ్లనని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ తేల్చి చెప్పారు.
ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సీటుకు ఇస్తామని, కేంద్ర మంత్రిని చేస్తామని బీజేపీ హైకమాండ్ హామీ ఇచ్చినా మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారనే ప్రశ్నకు మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ఆయన శైలిలో సరైన సమాధానం చెప్పారు.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయిన తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ నిరాకరించిందని, తనమీద ఎలాంటి రిమార్క్ లేకపోయినా తనకు ఎందుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం లేదని తాను ప్రశ్నిస్తే బీజేపీ హైకమాండ్ దగ్గర సమాధానం లేదని, తనకు ఆత్మాభిమానం ఎక్కువ కావడం వలనే మనసు చంపుకోలేక బీజేపీకి రాజీనామా చేశానని జగదీష్ శెట్టర్ అన్నారు.
చాలా నెలల నుంచి తాను ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చెయ్యాలని అనుకుంటున్న సమయంలో బీజేపీ హైకమాండ్ తనకు సీటు ఇవ్వడానికి నిరాకరించిందని, అందుకే తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని జగదీష్ శెట్టర్ అన్నారు. ఆత్మాభిమానం చంపుకుని ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు తల ఊపడానికి తాను సిద్దంగా లేనని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఆరు నెలలు ఎమ్మెల్యేగా ఉన్న తరువాత తనను పార్టీకి రాజీనామా చెయ్యమని చెప్పి ఉంటే సంతోషంగా రాజీనామా చేసి ఉండేవాడినని, కానీ బీజేపీ హైకమాండ్ అలా చెయ్యలేదని, కేవలం ఆ పార్టీ నాయుడు బీఎల్. సంతోష్ కారణంగా తాను ఆ పార్టీకి రాజీనామ చేసి బయటకు రావాలసి వచ్చిందని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించే సత్తా ఉన్నా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారనే ప్రశ్నకు జగదీష్ శెట్టర్ సమాధాం ఇచ్చారు. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయి ఉంటే తనన కొందరు బెదిరించి రాజకీయం చెయ్యడానికి ప్రయత్నిస్తారని, జాతీయ పార్టీ నుంచి బయటకు వచ్చిన తాను మారో జాతీయ పార్టీ కాంగ్రెస్ లో చేరానని, తనకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో వివరించారు.












Click it and Unblock the Notifications