ఢిల్లీలో స్కెచ్, 28లో ఎన్ని టార్గెట్ చెయ్యాలి?, ఆ పార్టీకి ఇన్ని సీట్లు, పక్కాప్లాన్ తో సీఎంకు చెక్!

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడించడానికి కర్ణాటకలో కలిసి పోటీ చెయ్యాలని డిసైడ్ అయిన బీజేపీ, జేడీఎస్‌ పార్టీలు రాజకీయ వ్యూహాన్ని రచించడం ప్రారంభించాయి. కర్ణాటక రాష్ట్రంలో వీలైనన్ని లోక్ సభ స్థానాలను నిలబెట్టుకునేందుకు బీజేపీ, జేడీఎస్ పార్టీలు వ్యూహరచన చేస్తోంది. కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిల మధ్య పొత్తు కుదిరిందని తెలిసింది.

కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 28 లోక్ సభ నియోజకవర్గాల్లో మూడింటిని జేడీఎస్‌కి వదులుకునేందుకు బీజేపీ సిద్ధమైందని తెలిసింది. మిగిలిన 25 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఇప్పటికే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమై చర్చించారు. బుధవారం బీజేపీ హైకమాండ్ నేతలతో మాజీ సీఎం కుమారస్వామి చర్చించారు.

Former CM Kumaraswamy held talks with Amit Shah to contest the Lok Sabha elections together

జేడీఎస్ పార్టీ ఏ నియోజకవర్గంలో మొగ్గుచూపుతున్నదో తెలుసుకుని ఆ ప్రాంతాల్లోని ఓటర్లు, అక్కడి ప్రజల కులాల లెక్కలపై చర్చించారని తెలిసింది. బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ్ముడు, సిట్టింగ్ ఎంపీ డీకే సురేష్ పోటీ చేస్తున్నారు అయితే డీకే సురేష్‌ను ఓడించేందుకు బీజేపీ, జేడీఎస్ నేతలు ఇప్పటి నుంచి అనేక వ్యూహాలు రచిస్తున్నారని తెలిసింది. ఈ నెలాఖరులో బీజేపీ, జేడీఎస్ అభ్యర్థుల తుది జాబితా వెలువడే అవకాశం ఉంది.

తుమకూరు, బెంగళూరు రూరల్ నియోజకవర్గాలను వదులుకోవాలని బీజేపీని జేడీఎస్‌ కోరింది. అయితే పలు లెక్కలు వేసిన బీజేపీ నేతలు మాత్రం మండ్య, హాసన్, కోలార్ లేదా చిక్కబళ్లాపురం నియోజకవర్గాలు జేడీఎస్ కు ఇవ్వడానికి ఫిక్స్ అయినట్లు బీజేపీకి చెందిన కొందరు నాయకులు చెబుతున్నారు. కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజక వర్గాల్లో బీజేపీ-జేడీఎస్ పొత్తు పెట్టుకుని పోటీ చెయ్యాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. బీజేపీకి ఏయే నియోజకవర్గాలు, జేడీఎస్‌కు ఏయే నియోజకవర్గాలు అనే సమాచారం ఇలా ఉంది.

Former CM Kumaraswamy held talks with Amit Shah to contest the Lok Sabha elections together

బీజేపీ పోటీ చేసే లోక్ సభ నియోజకవర్గాలు ఇవే?

* బెంగుళూరు సెంట్రల్

* తుమకూరు

* బెంగుళూరు సౌత్

* బెంగుళూరు నార్త్

* బెంగుళూరు రూరల్

* మైసూర్

* చామరాజనగర్

* చిక్కమగళూరు

* దావణగెరె

* శివమొగ్గ

* హవేరి

* చిక్కబల్లాపూర్

* ఉత్తర కన్నడ

* దక్షిణ కన్నడ

* హుబ్బళి-ధారవాడ

* చిత్రదుర్గ

* బాగల్‌కోటే

* బళ్ళారి

* కొప్పల్

* విజయపర

* కలబురిగి

* బెళగావి

* బీదర్

*చిక్కోడి

* రాయచూర్

జేడీఎస్ పోటీ చేసే లోక్ సభ నియోజక వర్గాలు ?

* మండ్య

* హాసన్

* కోలారు/ చిక్కబళ్లాపురం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+