సిటీ బస్సులో మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే, ఎయిర్ పోర్టులో ఏం జరిగిందంటే ?
బెంగళూరు: వివిధ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 11వ తేదీన సోమవారం బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చిన యూనియన్ ఆఫ్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ బంద్ ను విజయవంతం చెయ్యడానికి ప్రయత్నించింది. బెంగళూరు బంద్ ప్రభావం సామాన్య ప్రజలతో పాటు భారత మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లేపై పడింది.
క్యాబ్ యజమానులు, క్యాబ్ డ్రైవర్ల సమ్మె కారణంగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి నిత్యం సంచరించే క్యాబ్ లు ఒక్కసారిగా నిలిచిపోయాయి. బెంగళూరు విమానాశ్రయంలో క్యాబ్ దొరక్క భారత జట్టు మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సులో ప్రయాణించి బెంగళూరులోని ఆయన ఇంటికి చేరుకున్నారు.

దీనిపై మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే ట్వీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. దీని గురించి X (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన కన్నడిగ అనీల్ కుంబ్లే ఈ రోజు నేను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బెంగళూరులోని తన ఇంటికి రావడానికి బీఎంటీసీ బస్సు సర్వీస్‌ను ఉపయోగించాను, నాకు చాలా సంతోష:గా ఉందని అనీల్ కుంబ్లే ట్విట్టర్ లో రాశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ అనీల్ కుంబ్లే తన సాధాసీదా వ్యక్తిత్వాన్ని క్రికెట్ అభిమానులను అభినందిస్తున్నారు. బెంగళూరు బంద్ పిలుపుతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. కర్ణాటకలోని ఇతర నగరాలు, ఇతర జిల్లాల నుండి బెంగళూరు చేరుకున్న ప్రజలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులు బీఎంటీసీ, మెట్రో రైలులో ప్రయాణించారు.
బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి వస్తున్న ప్రయాణికులకు నిత్యం సేవలు అందిస్తున్న టాక్సీ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, యజమానులు బంద్‌లో పాల్గొంటున్నందున అసర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బీఎంటీసీ అధికారులు ఎక్కువ సంఖ్యలో వోల్వో బస్సులను నడిపారు.
BMTC trip back home today from the airport. pic.twitter.com/jUTfHk1HrE
— Anil Kumble (@anilkumble1074) September 11, 2023
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరులోని ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నారు. బీఎంటీసీ వోల్వో బస్సులతో పాటు వాయువజ్ర బస్సుల్లో దేవనహళ్లి సమీపంలోని విమానశ్రయం నుంచి బెంగళూరు చేరుకోవడానికి విమానంలో ప్రయాణించిన వారు సోమవారం ఎక్కువ ఆసక్తి చూపించారు. విమాన ప్రయాణికులతో బీఎంటీసీ వోల్వో, వాయువజ్ర బస్సులు కిటకిటలాడుతున్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications