ఇంటిపేరు తెచ్చిన తంటా, షిండే కుటుంబంపై తప్పుడు ప్రచారం

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ఏ మాత్రం సంబంధం లేని కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబాన్ని, ఆయన రెండో కుమార్తె ప్రీతిష్రాఫ్ ను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు.ప్రీతి ఇంటిపేరు ష్రాఫ్ కలిగిన మరో మహిళ చేసిన తప్పును సుశీల్ కుమార్ రెండో కుమార్తె చేసినట్టుగా భావించి నెటిజన్లను మేసేజ్ లు పెట్టారు.

చిన్నపొరపాటు కారణంగా చేయని తప్పుకు సోషల్ మీడియాలో నెటిజన్లు సుశీల్ కుమార్ షిండే రెండో కుమార్తె ప్రీతిష్రాఫ్ బలైంది.సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు షిండే కుటుంబంలో కలకలం రేపాయి.

Former Maharashtra CM’s daughter trolled for accident she did not cause

చివరకు ప్రీతి, ఆమె భర్త మీడియా ముందుకు వచ్చిన వివరణ ఇవ్వడంతో తప్పుడు ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. గత సోమవారంనాడు పూణెలో కారు నడుపుతూ వెళ్ళుతున్న ఓ మహిళ పుట్ పాత్ పై నిల్చున్న వారిని ఢీకొట్టింది.దీంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రీతి పుట్ పాత్ పై ఉన్నవారిపై కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమయ్యారంటూ సోషల్ మీడియాలో మేసేజ్ లు పంపారు. ఏం జరిగిందంటూ షిండే కుటుంబసభ్యుల స్నేహితులు ఆరా తీశారు. ఈ పుకార్లు విని షిండే కుటుంబసభ్యులు షాకయ్యారు.

కాంగ్రెస్ నేత , వ్యాపారవేత్త రాజ్ ష్రాఫ్ ను ప్రీతి వివాహం చేసుకొన్నారు. ఈ ప్రచారంపై ఏ రకంగా స్పందించాలో అర్ధం కావడం లేదని రాజ్ అన్నారు.ఏం జరిగిందో తెలుసుకోకుండా ప్రమాదానికి కారణం ఎవరో తెలుసుకోకుండా తమపై సోషల్ మీడియాలో ఎవరు ఎందుకిలా తప్పుడు ప్రచారం చేశారు? కనీసం పేపర్లో వచ్చిన వార్తను కూడ చదవకుండా తమపై నిందలు వేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ దుష్ప్రచారాన్ని ఆపి, నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పూణె పోలీస్ కమిషనర్ ను ఆయన కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Social media has given people an outlet to display their opinions. So eager are they to do this, that some don’t even check facts. The family of former chief minister and former union Home Minister Sushilkumar Shinde, is learning this the hard way.
Please Wait while comments are loading...