సెక్స్ స్కాండల్ కేసులో జైలు నుంచి మాజీ మంత్రి విడుదల, లాఠీచార్జ్ తో హడల్, విదేశాల్లో కొడుకు !

సెక్స్ స్కాండల్ కేసులో ఓ మహిళను కిడ్నాప్ చేశారని నమోదు అయిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కర్ణాటక మాజీ మంత్రి, హలేనరసీపుర జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ మంగళవారం జైలు నుంచి విడుదల అయ్యారు. బెయిల్‌ ప్రక్రియను ముగించుకున్న మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ మంగళవారం జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో పోలీసులు జేడీఎస్ పార్టీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు.

బెంగళూరు నగర శివార్లలోని పరప్ప అగ్రహార సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ జైలు నుంచి విడుదలైన సందర్భంగా జైలు గేటు ముందు తోపులాట జరిగింది. మాజీ మంత్రి రేవణ్ణ కారుపై జేడీఎస్ పార్టీ కార్యకర్తలు పడటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సందర్బంలో జేడీఎస్ పార్టీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.

Former minister HD Revanna released from jail in woman kidnapping case

కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ పార్టీలో బలమైన నాయకుడు అయిన హెచ్ డీ రేవణ్ణ ఓ మహిళను కిడ్నాప్ చేశారని ఆరోపణలు రావడంతో కొన్ని రోజుల క్రితం సిట్ అధికారులు ఆయన్ను అరెస్టు చేసి బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. తరువాత కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ జైలు నుంచి బయటకు రావడానికి బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.

జైలు నుంచి బయటకు రాగానే హెచ్‌డీ రేవణ్ణకు అనుకూల జేడీఎస్ కార్యకర్తలు జైలు ముందు నినాదాలు చేశారు. మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న సమయంలో చాలా మంది కార్యకర్తలు ఆయన్ను చూడటానికి దూసుకెళ్లారు. ఆ సమయంలో మాజీ మంత్రి రేవణ్ణ ఉన్న కారు ఆగిపోయింది. ఆ సందర్బంలో జేడీఎస్ కార్యకర్తలు కారును అడ్డుకుని రేవణ్ణ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన్ను చూడటానికి పోటీపడ్డారు.

Former minister HD Revanna released from jail in woman kidnapping case

ఆ సమయంలో పరిస్థితి అదుపుతప్పటంతో జేడీఎస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో పోలీసులు తమపై లాఠీచార్జి చేశారని జేడీఎస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల జైలు శిక్ష అనంతరం కర్ణాటక హెచ్‌డీ రేవణ్ణ బెంగళూరులోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఈ సమయంలో రేవణ్ణను చూసి ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

సెక్స్ స్కాండల్ కేసులో తప్పించుకుని విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ కోసం సిట్ అధికారులు వెతుకూతూనే ఉన్నారు. అయితే అదే కేసులో ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు అయ్యి 10 రోజులకు పైగా జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చిన మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ ఇప్పుడు ఎలా స్పందిస్తారు అని జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+