ఫ్రెండ్స్ తో లేడీస్ ను టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్యే మనుమడు, నకిలి నెంబర్ ప్లేట్ తో ?

ముగ్గురు యువకులు బెంగళూరులోని నాలుగు వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో దోపిడీలు, చైన్ స్నాచింగ్ లు చేస్తున్నారు. బైక్‌కు నకిలీ నంబర్‌ ప్లేట్‌ అమర్చి చైన్ స్నాచింగ్ లకు పాల్పడేవాడని పోలీసుల విచారణలో తేలింది. అరెస్టు అయిన ముగ్గురు నిందితుల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే మనుమడు కూడా ఉండటంతో పోలీసులు బిత్తరపోయారు.

కర్ణాటక మాజీ ఎమ్మెల్యే మనుమడు చైన్ స్నాచింగ్ లు చేస్తున్నాడని తెలుసుకున్న బెంగళూరు ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకున్న నిందితులు వారిని అడ్రస్‌ అడుగుతున్న నెపంతో చైన్ స్నాచింగ్ లు చేస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. చైన్ స్నాచింగ్ లు చేస్తున్న నిందితుల కోసం పోలీసులు కొంతకాలంగా నిఘా వేశారు.

 Former MLAs grand son is targeting women and chain snatching in Bengaluru along with his friends.

ముగ్గురు నిందితులను బెంగళూరులోని సోలదేవనహళ్లి స్టేషన్‌ పరిధిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టు అయిన ముగ్గురు నిందితులను అభి, రాకేష్, సల్మాన్‌లుగా గుర్తించామని, ఈ ముగ్గురు దుండగులు బెంగళూరులోని నాలుగు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో దోపిడీలకు, చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నట్లు తెలిసిందని పోలీసులు అన్నారు. బైక్‌కు నకిలీ నంబర్‌ ప్లేట్‌ అమర్చి దొంగతనానికి, చైన్ స్నాచింగ్ లకు పాల్పడేవారని పోలీసుల విచారణలో తేలింది.

 Former MLAs grand son is targeting women and chain snatching in Bengaluru along with his friends.

చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు గత కొంత కాలంగా నగరంలోని పలు ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఈ కేసుకు సంబంధించి చోరీలు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో నిందితుల కదలికలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుల అరెస్టుకు వలపన్నారు. చైన్ స్నాచింగ్ లు చెయ్యడానికి ప్రయత్నించిన నిందితులు బెంగళూరు పోలీసులకు చిక్కిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+