సీఎంగా కొడుకు ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేసిన మాజీ ప్రధాని, అంతా ఓకేనా ?

బెంగళూరు/హాసన్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీ విజయం సాధిస్తుందో చెప్పడం సాధ్యం కావడంలేదని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే తన కుమారుడు హెచ్ డీ. కుమారస్వామి కర్ణాటకకు మారోసారి ముఖ్యమంత్రి అవుతారని, ఆయన ఏ రోజు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు అనే డేట్ కూడా చెప్పిన మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ అందరికి షాక్ ఇచ్చారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో జేడీఎస్ పార్టీ తరపున మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ. మాజీ సీఎం కుమారస్వామి పలు నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాని హాసన్ లో ప్రచారం చేస్తున్న మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 kumaraswamy

మే 10వ తేదీన మన జేడీఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారని, 13వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయని, తరువాత కర్ణాటకలో మన పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. మే 18వ తేదీన మీ కుమారన్న (హెచ్ డీ. కుమారస్వామి) కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ బాంబు పేల్చారు.

మేము ఇప్పటికే బీజేపీ హైకమాండ్ తో, అలాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నామని. త్వరలో కర్ణాటకలో అద్బుతం జరగబోతున్నదని మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ అన్నారు. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ రాదని పలు సర్వేలు చెప్పడంతో ఆ రాష్ట్రంలో మేమే కింగ్ మేకర్లు అని జేడీఎస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.

కర్ణాటకకు తానే ముఖ్యమంత్రి అవుతానని రెండు రోజుల క్రితం మాజీ సీఎం కుమారస్వామి బహిరంగ సభలో దీమా వ్యక్తం చేశారు. ఇంతకు ముందు కూడా ఇలాగే లక్కీచాన్స్ తో కుమారస్వామి సీఎం అయ్యారు. అయితే ఒక అడుగు ముందుకు వేసిన మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ ఆయన కుమారుడు హెచ్ డీ. కుమారస్వామి ఏ రోజు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు అని డేట్ కూడా ఫిక్స్ చెయ్యడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+