సెక్స్ స్కాండల్ సీడీ ఎఫెక్ట్, మాజీ ప్రధాని మనుమడు బహిష్కరణ, ఎంపీగా గెలిస్తే పరిస్థితి ఏంటి ?
హాసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వీడియో వైరల్ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల ఈ కేసు కర్ణాటకలో పెద్ద ఎత్తున దుమారం రేపడంతో జేడీఎస్ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్ డీ దేవేగౌడకు ప్రజ్వల్ రేవణ్ణ స్వయానా మనుమడు కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా దూమరంరేపుతోంది.
ఇదే సమయంలో హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురికావడం హాట్ టాపిక్ అయ్యింది. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలు అంటూ లెక్కలేనన్ని అశ్లీల వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్ డీ. దేవెగౌడ స్వయంగా తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి బహిష్కరించాలని ఆదేశించారని వెలుగు చూడటం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

ఇదే సమయంలో హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి, హాసన్ జిల్లాలోని వీది వీదిలో ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన అశ్లీల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. హాసన్ లోని ఓ వీధిలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన అశ్లీల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ దొరికింది. ఈ విషయంపై సర్వత్రా చర్చ మొదలైయ్యింది. ఇదే సమయంలో మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ కుటుంబం కూడా కంగుతిన్నది. అలాగే జేడీఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలు తీసుకోవాలని మాజీ ప్రధాని దేవేగౌడకు మనవి చేశారు.
హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ పార్టీ నుంచే బహిష్కరించాలని జేడీఎస్ పార్టీలోనే తిరుగుబాటు మొదలైయ్యింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రజ్వల్ రేవణ్ణపై స్వరం పెంచడంతో ఈ విషయం జేడీఎస్ నేతలను నివ్వెరపరిచింది. ఇప్పటికే జేడీఎస్ పార్టీలో, ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వాతావరణం నెలకొనింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశాలు బలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి ప్రజ్వల్ రేవణ్ణ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది. మరోవైపు ఈసారి హాసన్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రజ్వల్ రేవణ్ణ గెలిస్తే కథ ఎలా ఉంటుంది? అంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైయ్యింది. ఎంపీగా గెలిచిన తరువాత కూడా ప్రజ్వల్ రేవణ్ణ ఆయన పదవికి రాజీనామా చేస్తారా?, లేదా ? అనే ప్రశ్న కూడా తలెత్తింది. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు వేదికైంది. అలాగే ఇదే అంశంపై కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications