మాజీ ప్రధానికి ఊహించని ఎదురు దెబ్బ, దేవేగౌడ ఫ్యామిలీ కథ ఏమిటి అంటున్న ప్రజలు !

బెంగళూరు: కర్ణాటకలోని తుమకూరు లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఓడిపోయారు. బీజేపీ నుంచి పోటీ చేసిన బసవరాజ్ మాజీ ప్రధాని దేవేగౌడను ఓడించారు. మాజీ ప్రధాని దేవేగౌడ మీద పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బసరాజ్ 15, 433 ఓట్ల మెజారిటీతో విజయం సాదించారు. మాజీ ప్రధాని దేవేగౌడ ఫ్యామిలీ కథ ఏమిటి అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.

మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ హాసన్ నియోజక వర్గం నుంచి గతంలో పోటీ చేసేవారు. అయితే మనుమడు ప్రజ్వల్ రేవణ్ణను హాసన్ నియోజక వర్గం నుంచి బరిలో దింపిన మాజీ ప్రధాని దేవేగౌడ తుమకూరు నుంచి పోటీ చేశారు. ఎన్నికల కౌంటింగ్ లో మొదటి కొన్ని రౌండ్లలో మాత్రమే మాజీ ప్రధాని దేవేగౌడ ముందంజలో ఉన్నారు.

Former Prime Minister HD Deve Gowda lost to GS Basavaraj of BJP in Tumkur.

చివరి రౌండ్లలో వెనుకంజలో ఉన్న మాజీ ప్రధాని దేవేగౌడ చివరికి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలైనారు. ఇవే నా చివరి ఎన్నికలు అని చెప్పిన మాజీ ప్రధాని చివరి సారి లోక్ సభలో అడుగుపెట్టాలని ప్రయత్నించి ఓడిపోయారు. జేడీఎస్ చీఫ్ మాజీ ప్రధాని ఓటమిని ఆ పార్టీ నాయకులు ఊహించలేకపోయారు.

గతంలో మాజీ ప్రధాని దేవేగౌడ ఓడిపోయిన సంఘటనలు ఉన్నాయి. 1999 లోక్ సభ ఎన్నికల్లో హాసన్ నుంచి పోటీ చేసిన దేవేగౌడ ఓడిపోయారు. 2004 కనకపుర లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన దేవేగౌడ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి తేజస్విని శ్రీరమేష్ చేతిలో ఓడిపోయారు. సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి మండ్యలో ఓడిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+