ముచ్చటగా మూడోసారి ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే పెళ్లి: ఫొటోలు, వీడియో వైరల్

న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే(Harish Salve) 68 ఏళ్ల వయస్సులో మూడో వివాహం చేసుకున్నారు. త్రినా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు.ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

లండన్‌లో అతికొద్ది మంది స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ, లలిత్ మోడీ, ఉజ్వల రౌత్ హాజరయ్యారు. వీరితోపాటు సునీల్‌ మిట్టల్‌, ఎల్‌ఎన్‌ మిట్టల్‌, ఎస్వీ లోహియా, గోపీ హిందూజా, వంటి ప్రముఖులు హాజరయ్యారు. 68 ఏళ్ల సీనియర్ న్యాయవాది అయిన సాల్వేకి ఇది మూడో వివాహం.

former solicitor general of India Harish Salve weds for third time

హరీశ్ సాల్వేకి మొదట మీనాక్షితో వివాహం జరిగింది. మూడు దశాబ్దాల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2020 జూన్‌లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి కరోలిన్ బ్రసార్ట్‌ను పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత ఆమె నుంచి కూడా విడిపోయారు.

హరీష్ సాల్వే దేశంలో ప్రముఖమైన కేసులకు న్యాయవాదిగా వ్యవహరించారు. 1999 నవంబర్‌ నుంచి 2002 నవంబర్‌ వరకూ భారతదేశ సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేశారు. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్‌ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన కులభూషణ్‌ జాదవ్‌ కేసు సహా పలు ఉన్నతస్థాయి కేసుల్లో సాల్వే న్యాయవాదిగా వ్యవహరించారు. ఈ కేసు ప్రస్తుతం ఇంటర్నేషన్ కోర్టులో ఉంది. ఈ కేసుకు గానూ సాల్వే కేవలం రూ. 1 మాత్రమే లీగల్ ఫీజుగా తీసుకొని అందరిచేతా ప్రశంసలు అందుకున్నారు.

టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ గ్రూప్ వంటి వారు సాల్వేకు క్లయింట్స్ గా ఉన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులోనూ వాదించారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ పై కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ వివాదం కేసును కూడా ఈయనే వాదించారు.

భారత ప్రభుత్వం 2015లో హరీష్ సాల్వేకు అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన 'పద్మ భూషణ్'ని ప్రకటించింది. మరోవైపు, ఇటీవల ఒకే దేశం - ఒకే ఎన్నిక కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలోనూ హరీశ్ సాల్వే సభ్యుడిగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+