వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జయ సమాధిపైనే అంత బలంగా కొడితే, బతికున్నప్పుడు ఇంకెంత కసిగా కొట్టిందో'

అన్నాడీఎంకే అధినేత్రి శశికళ పైన తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఇళంగోవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ పైన తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఇళంగోవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జయలలిత సమాధి పైన అంత బలంగా కొట్టిన శశికళ.. ఆమె బతికి ఉన్నప్పుడు ఇంకెంత బాగా కొట్టారోనని వ్యాఖ్యానించారు.

ఆయన గురువారం ఈరోడ్‌లో మాట్లాడారు. శశికళ బెంగుళూరు జైలుకు వెళ్తూ శపథం పేరుతో జయ సమాధిపై చేతితో బాదిన దృశ్యాలను ప్రసార మాధ్యమాల్లో చూసి దిగ్భ్రాంతి చెందానని తెలిపారు.

<strong>జైలు ఫుడ్, క్యాండిల్స్ తయారీతో రోజుకు రూ.50: భర్తను కౌగిలించుకొని ఏడ్చిన శశికళ </strong>జైలు ఫుడ్, క్యాండిల్స్ తయారీతో రోజుకు రూ.50: భర్తను కౌగిలించుకొని ఏడ్చిన శశికళ

ఎన్నో ఏళ్ల పగతో రగిలిపోతున్న వ్యక్తిగా శశికళ కనిపించిందన్నారు. సమాధినే ఇంత బలంగా కొట్టిన ఆమె, జయను ఎన్నిసార్లు ఎంత బలంగా కొట్టిందోనని తనతో పాటు దేశప్రజలందరికీ అనుమానంగానే ఉందన్నారు.

Former TNCC president Elangovan lashes out at Sasikala

రాష్ట్రంలో ఇప్పటిదాకా అవినీతికి పాల్పడి అక్రమార్జనే ధ్యేయంగా వ్యవహరించిన అన్నాడీఎంకే నాయకులకు సుప్రీం కోర్టు తీర్పు చక్కటి గుణపాఠమన్నారు. ప్రజల సొమ్మును దోచుకున్నవారెంతటివారైనా జైలుకు వెళ్లాల్సిందే అన్నారు.

నటరాజన్ ఏం చేశారంటే..

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శశికళ ప్రత్యేక కోర్టులో లొంగిపోయి, ఆ తర్వాత బుధవారం సాయంత్రం పరప్పణ అగ్రహార జైలుకు చేరుకున్నారు. ఇందుకోసం చెన్నై నుంచి బుధవారం ఉదయం రోడ్డు మార్గంలో బయలుదేరిన శశికళ సాయంత్రానికి బెంగుళూరుకు చేరుకున్నారు.

ఆ సమయంలో శశికళ వెంట భర్త నటరాజనతో పాటు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. రెండో రోజైన గురువారం ఉదయం భార్యతో మిలాఖత్ జరిపేందుకు నటరాజన్ ప్రయత్నించారు. అది సాధ్యపడలేదు. కానీ, జయలలిత తరపు న్యాయవాది మాత్రం శశికళతో మిలాఖత్ అయ్యారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం నటరాజన్‌తో పాటు.. ఇతర కుటుంబ సభ్యులు చెన్నై చేరుకున్నారు.

English summary
Former TNCC president Elangovan lashed out at AIADMK Sasikala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X