విద్యార్ధులకు ఉచితంగా స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు !! : మణిపూర్‌లో బీజేపీ హామీల వర్షం

మణిపూర్‌లో మరోసారి అధికారం చేపట్టేందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత హామీలను కురిపించింది. కళాశాలలకు వెళ్లే మెరిట్ అమ్మాయిలందరికీ ఉచితంగా స్కూటీలు అందిస్తామని ప్రకటించింది. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీ ఇచ్చింది.

బాలిక‌ల‌కు ప్రోత్సాహం కింద రూ. 25 వేలు

మణిపూర్‌లో అభివృద్ధి బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలకు తోడ్పాటునందిస్తామని చెప్పారు. ఈ మేరకు పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఆర్థికంగా వెనుకబడిన, బ్యాక్‌వర్డ్ తరగతులకు చెందిన బాలికలకు " రాణి గైడిన్‌లియు నుపి మహేయిరోయ్ సింగి" పథకం కింద రూ. 25,000 ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. ఇవి వారి విద్యకు అభివృద్ధికి తొడ్పడతాయని తెలిపారు.

 వృద్ధుల‌ ఫించ‌ను రూ. 1000 పెంపు

వృద్ధుల‌ ఫించ‌ను రూ. 1000 పెంపు


అదేవిధంగా పీఎం ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి రెండు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని బీజేపీ హామీలు గుప్పించింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏర్పాటు చేస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు.. ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రూ. 200 నెలవారీ పింఛనును రూ. 1000 పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ఏడాదికి అందిస్తున్న రూ. 6 వేలను రూ. 8 వేలకు పెంచుతామని పేర్కొంది.

 రెండు విడ‌త‌ల్లో పోలింగ్‌

రెండు విడ‌త‌ల్లో పోలింగ్‌

రాష్ట్రంలోని చిన్న, సన్నకారు, భూమి లేని రైతుల పిల్లలు గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో సాంకేతిక విద్యను అభ్యసించేందుకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో వివరించింది. జాలర్లకు ఉచితంగా రూ. 5 లక్షల ప్రమాద బీమా అందిస్తామని హామీ ఇచ్చింది. హోమ్‌స్టేలను అభివృద్ధి చేయడానికి రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 28, మార్చి 5న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+