వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగ్గిన రూ.2వేల నోట్ల చలామణి-ఆర్బీఐ వార్షిక నివేదికలో ఆసక్తికర విషయాలు...

|
Google Oneindia TeluguNews

దేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్త రూ.2వేల నోట్లను మార్కెట్‌లోకి తీసుకురాలేదని ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త రూ.2 వేల నోట్లను చలామణిలోకి తీసుకొచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ తమ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.

గ‌త రెండేళ్లుగా రూ.2వేల క‌రెన్సీని ముద్రించడం ఆర్బీఐ నిలిపివేసింది. చలామణీలో ఉన్న రూ.2వేల నోట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2019-20లో రూ.2000 నోట్ల విలువ రూ.5,47,952 కోట్లు ఉండగా 2020-21 నాటికి రూ.4,90,195 కోట్ల‌కు ప‌డిపోయింది. అంటే,రూ.57,757 కోట్ల విలువ గ‌ల రూ.2000 నోట్లు మార్కెట్‌లో చ‌లామ‌ణిలో లేకుండా పోయాయి. 2018 మార్చి నాటికి 336.3కోట్ల రూ. 2000 నోట్లు చలామణీలో ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆ సంఖ్య రూ. 245.1 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు 91.2కోట్ల నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. 2019-20లో మొత్తం మార్కెట్‌లో చ‌లామణిలో ఉన్న నోట్ల‌లో రూ.2000 నోట్లు 22.6 శాతంగా ఉండగా... ఇప్పుడది 17.3శాతానికి పడిపోయింది.

fresh Rs 2000 Note Supply Stopped says rbi in annual report

ఈ ఏడాది మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువలో రూ. 500, రూ. 2వేల నోట్ల వాటా 85.7శాతంగా ఉందని ఆర్‌బీఐ తమ నివేదికలో చెప్పింది. గతేడాది ఇది 83.4శాతంగా ఉందని... ప్రస్తుతం కరోనా నేపథ్యంలో నగదు వినియోగం పెరిగిందని పేర్కొంది. డిమాండ్‌కు అనుగుణంగా నోట్ల సరఫరా కూడా చేపట్టామని.. కరెన్సీ చెస్ట్‌ల్లో సరిపడా నిల్వలు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్ల సంఖ్యలో 31.1 శాతం రూ. 500 నోట్లు ఉండగా.... ఆ తర్వాత 23.6 శాతంతో రూ. 10 నోట్లు ఉన్నట్లు తెలిపింది.

Recommended Video

Fuel Prices Hike Not Only Affects Those With Cars, Bikes - RBI Guv Shaktikanta Das

కాగా,2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేపట్టిన సంగతి తెలిసిందే. రూ1000 నోటును రద్దు చేసిన కేంద్రం దాని స్థానంలో రూ.2వేల నోటును తీసుకొచ్చింది. అయితే క్రమంగా రూ.2వేల నోటు చలామణి తగ్గుతుండటంతో ఆర్బీఐ భవిష్యత్తులో దీన్ని ఉపసంహరించుకోవచ్చునన్న ప్రచారం సాగుతోంది.

English summary
There were no fresh notes of Rs 2000 supplied in the Financial Year 2021-22, the Reserve Bank of India (RBI) has informed. Since 2019, the printing of Rs 2000 notes is suspended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X