Friends: అక్క చెంప పగలగొట్టిన ఫ్రెండ్, క్రికెట్ గ్రౌండ్ లో వాడి కత్తి లాక్కొని వాడినే చంపి !
బెంగళూరు: ఒకే ఏరియాలో ఉంటున్న ముగ్గురు యువకులు చిన్నప్పటి నుంచి స్నేహితులు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఖర్చులకు డబ్బు సంపాధించుకుని మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్నేహితుడి ఇంటి ముందు దర్జాగా కుర్చున్న ఓ యువకుడు మద్యం సేవించాడు. అదే రోజు మద్యం మత్తులో అతని ఫ్రెండ్ అక్కకు గూభ పగలగొట్టి రెచ్చిపోయాడు. తరువాత స్నేహితులు క్రికెట్ గ్రౌండ్ లో మద్యం సేవించడానికి వెళ్లారు. ఆ సందర్బంలో ఇద్దరు స్నేహితులు కలిసి మహిళ మీద దాడి చేసిన స్నేహితుడి దగ్గర ఉన్న కత్తి లాక్కొని వాడినే పొడిచి చంపేశారు.

చిన్ననాటి స్నేహితులు
బెంగళూరు సిటీలోని పులకేశీనగర్ ఏరియాలోని పీఎస్ కే గార్డెన్ లో ప్రభు (24), విజయ్ పాల్, చౌకి అనే యువకులు నివాసం ఉంటున్నారు. ఒకే ఏరియాలో ఉంటున్న ప్రభు, చౌకీ, విజయ్ పాల్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఖర్చులకు డబ్బు సంపాధించుకుంటున్నన ప్రభు, చౌకీ, విజయ్ పాల్ మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఫ్రెండ్ ఇంటి ముందే మందు తాగేసి
స్నేహితుడు చౌకీ ఇంటి ముందు రాత్రి దర్జాగా కుర్చున్న ప్రభు మద్యం సేవించాడు. ఆ సందర్బంలో చౌకీ అక్క అభ్యంతరం చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, ఇక్కడ మద్యం సేవించడానికి ఏమైనా బార్ అండ్ రెస్టారెంట్ అని చౌకీ అక్క ప్రభును మందలించింది. ఆ సందర్బంలో మద్యం మత్తులో ఉన్న ప్రభు అతని ఫ్రెండ్ చౌకీ అక్కకు గూభ పగలగొట్టి ఆమెను చితకబాది రెచ్చిపోయాడు.

క్రికెట్ గ్రౌండ్ లో లిక్కర్ పార్టీ
తరువాత స్థానికులు సర్దిచెప్పి ప్రభును అక్కడి నుంచి పంపించేశారు. అదే రోజు రాత్రి ప్రభు, విజయ్, చౌకీ కలిసి పీఎస్ కే గార్డెన్ లోకి క్రికెట్ గ్రౌండ్ లో మద్యం సేవించడానికి వెళ్లారు. ఆ సందర్బంలో ముగ్గురు పీకలదాక మద్యం సేవించారు. తరువాత నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా అక్క మీద దాడి చేస్తావు అంటూ చౌకీ అతని ఫ్రెండ్ ప్రభును నిలదీశాడు.

వాడి కత్తి లాక్కొని వాడినే ఏసేశారు
ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోయింది. జోబులో ఉన్న కత్తి తీసుకున్న ప్రభు అతని స్నేహితుడు విజయ్ మీద దాడి చేశారు. ఆ సమయంలో విజయ్ చేతికి గాయాలైనాయి. విజయ్, చౌకీ కలిసి ప్రభు చేతిలో ఉన్న కత్తి తీసుకుని అతన్నే పొడిచి చంపేశారు. అక్క మీద దాడి చేసిన ప్రభును అతని స్నేహితులే హత్య చేశారని, విజయ్, చౌకీని అరెస్టు చేశామని పులకేశీనగర పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications