రిటైర్మెంట్‌లోనూ రికార్డు సృష్టించిన జస్టిస్ కర్ణన్
వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ తన రిటైర్మెంట్‌లోనూ రికార్డు సృష్టించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే శిక్షలు విధించి, ఆపై కోర్టు ధిక్కరణ నేరానికి సుప్రీంకోర్టు 6నెలల జైలుశిక్ష .
కోల్‌కతా: వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ తన రిటైర్మెంట్‌లోనూ రికార్డు సృష్టించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే శిక్షలు విధించి, ఆపై కోర్టు ధిక్కరణ నేరానికి సుప్రీంకోర్టు 6నెలల జైలుశిక్ష విధించడంతో పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న జస్టిస్ సిఎస్ కర్ణన్ రిటైర్మెంట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
కాగా, సోమవారం ఆయన కోల్‌కతా హైకోర్టు జడ్జిగా రిటైరయ్యారు. కర్ణన్ అందుబాటులో లేకపోవడం వల్ల రిటైరవుతున్న జడ్జీ కోసం హైకోర్టు అధికారులు సాంప్రదాయం ప్రకారం ఇచ్చే వీడ్కోలు కార్యక్రమం జరగలేదని కోల్‌కతా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుగతో మజుందార్ చెప్పారు. ఇలా ఓ న్యాయమూర్తి విషయంలో జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

రిటైర్ అయ్యాక కర్ణన్‌కు చెల్లించాల్సిన బకాయిల గురించి అడగ్గా, చట్టప్రకారం అన్ని లాంఛనాలు పూర్తి చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. రిటైరవుతున్న జడ్జీకి లాయర్లు (బార్ అసోసియేషన్) కూడా వీడ్కోలు ఇవ్వడం సాంప్రదాయం. జస్టిస్ కర్ణన్ గనుక ఇక్కడ ఉండి ఉంటే బార్ అసోసియేషన్ కూడా ఆయనకు వీడ్కోలు ఇచ్చే విషయాన్ని పరిశీలించేదని, అయితే ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తమకు తెలియనందున ఆ ప్రశ్నే ఉత్పన్నం కాలేదని అదనపు అడ్వకేట్ జనరల్ అభ్రతోష్ చౌదరి తెలిపారు.
కోర్టు ధిక్కరణ నేరం కింద ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గత మే 9న జస్టిస్ కర్ణన్‌కు ఆరునెలల జైలుశిక్ష విధిస్తూ ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ పోలీసులను ఆదేశించడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎక్కడికో వెళ్లిపోయారు. కాగా, కర్ణన్ చెన్నైలోనే ఉన్నారని వార్తలు రావడంతో కోల్‌కతా నుంచి వచ్చిన పోలీసు బృందం దాదాపు నెల రోజులుగా చెన్నైలో మకాం వేసింది. కానీ, కర్ణన్ జాడ కనిపెట్టలేకపోయింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications