భయపడను: బీజేపీ, డీఎంకేపై విజయ్ హాట్ కామెంట్స్, ఎన్టీఆర్‌ని గుర్తు చేసి..
చెన్నై: కొత్త రాజకీయ పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ సినీనటుడు, దళపతి విజయ్ తన శక్తివంతమైన ప్రసంగంతో ప్రత్యర్థి పార్టీలకు చురకలంటించారు. తనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ.. తాను పాలిటిక్స్ విషయంలో భయపడటం లేదు అని స్పష్టం చేశారు. విల్లుపురం సమీపంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ మొదటి మహానాడులో విజయ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు.
ద్రవిడ జాతీయవాదం, తమిళ జాతీయవాదాన్ని వేరు చేయబోమన్నారు. తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే తమ భావజాలమని చెప్పుకొచ్చారు. దీని ఆధారంగానే పనిచేస్తామన్నారు. రాజకీయాల్లో ఫెయిల్యూర్స్, సక్సెస్ స్టోరీలు చదివాక.. తాను తన కెరీర్‌ని పీక్‌లో వదిలేసి మీ అందరిపై అచంచలమైన విశ్వాసాన్ని ఉంచి మీ విజయ్‌గా ఇక్కడ నిలబడ్డా అని విజయ్ పేర్కొన్నారు.

రాజకీయాల్లో పిల్లలమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారని.. కానీ, అమితమైన ఆత్మవిశ్వాసంతో మనం రాజకీయాలతో ఆడుకునే పిల్లలమని విజయ్ ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు. పెరియార్ ఈవీ రామస్వామి, కె కామరాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని నడిపిస్తామని విజయ్ చెప్పుకొచ్చారు. మరోవైపు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేపైన నేరుగా విమర్శలు గుప్పించారు. బీజేపీ నిరంకుశత్వంతో వ్యవహరిస్తందని విమర్శించారు.
Tamil Nadu | Actor and TVK President Vijay says "Politics is not a cine field. It is a battlefield. It would be a bit serious. If it is snake or politics, if we decide to take that in hands with seriousness and a little laughter then only we can sustain in this field and tackle… https://t.co/bhkDOJZz8a pic.twitter.com/mEElFBXvNt
— ANI (@ANI) October 27, 2024
డీఎంకే ద్రవిడియన్ నమూనాపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ద్రవిడియన్ మోడల్‌ను డీఎంకే వక్రీకరిస్తోందని మండిపడ్డారు. డీఎంకే కుటుంబ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటోందని విమర్శించారు. తన రాజకీయ ప్రయాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారన్నారు. అరియలూరులో నీట్ విద్యార్థిని అనిత ఆత్మహత్య ఉదంతాన్ని గుర్తు చేసిన విజయ్.. ఆ పరీక్షపై తన వ్యతిరేకత వైఖరిని తెలియజేశారు. తనను ఆర్టిస్ట్ కాదని కొందరు విమర్శలు చేస్తున్నారంటూ వారికి కౌంటర్ ఇచ్చారు విజయ్.
#WATCH | Tamil Nadu: Actor Vijay greets his party workers and fans at the first conference of his party Tamilaga Vettri Kazhagam in the Vikravandi area of Viluppuram district.
— ANI (@ANI) October 27, 2024
(Source: TVK) pic.twitter.com/O0WrAfOLyC
తెలుగునాట ఎన్టీఆర్ ది చెరగని ముద్ర
కాగా, విజయ్ తొలి బహిరంగ సభకు అభిమానులు, కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని దళపతి విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ద్రవిడ పార్టీలైన అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలతో పాటు బీజేపీని కూడా ఆయన శాసనసభ ఎన్నికల్లో ఎదుర్కోనున్నారు. విజయ్ పార్టీతో తమిళ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగనున్నాయి.












Click it and Unblock the Notifications