ఓవర్ నైట్ పొలిటికల్ సూపర్ స్టార్..!!
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఈ రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. 14న కౌంటింగ్. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ- జనతాదళ్ (యునైటెడ్), ఈ దఫా పీఠం ఎక్కాలనే పట్టుదలతో రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ కూటములు ఎన్నికల సంగ్రామంలో దిగాయి.
ఈ పరిస్థితుల మధ్య ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ రాజకీయ అరంగేట్రం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆమె బీహార్ కు చెందిన కేంద్రమంత్రి నిత్యానంద రాయ్, ఆ పార్టీ ఎన్నికల ఇన్ ఛార్జ్ వినోద్ తావ్డేతో భేటీ అయ్యారు. బీజేపీ టికెట్ పై పోటీ చేయాలనే తన నిర్ణయాన్ని వారికి వివరించారు. మధుబణి జిల్లాలోని బేణీపట్టి ను కోరుకుంటోన్నారు. అక్కడి నుండి మైథిలీ ఠాకూర్ బీజేపీ తరపున బరిలోకి దిగవచ్చని అంచనా వేస్తున్నారు.

ఆమె స్వస్థలం.. బేణీపట్టి. వయస్సు 25 సంవత్సరాలు. ఆమె పాడే జానపద గీతాలు, భక్తిరస గేయాలకు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంది. విదేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. బీహార్ ఎన్నికల తేదీల ప్రకటన వెలువడిన వెంటనే ఆమె నిత్యానంద్ రాయ్, వినోద్ తావ్డేతో భేటీ కావడం రాజకీయంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ భేటీ- ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై వస్తోన్న ఊహాగానాలను మరింత బలపరిచింది.
ఈ భేటీకి సంబంధించిన వివరాలను వినోద్ తావ్డే తన ఎక్స్ హ్యాండిల్‌లో వెల్లడించారు. ఫోటోలను పంచుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ పాలన సమయంలో 1995లో మైథిలీ ఠాకూర్ కుటుంబం బీహార్‌ను విడిచి వెళ్లిపోయిందని తెలిపారు. బీహార్ అభివృద్ధిని చూసి, ఇప్పుడు ఆమె రాష్ట్రానికి తిరిగి రావాలని కోరుకుంటున్నారని, ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఆమె సహకారాన్ని కోరుకుంటోన్నామని చెప్పారు. బిహార్ కీ బేటీ మైథిలీ ఠాకూర్ కు శుభాకాంక్షలు..అని రాశారు.
ఈ భేటీపై మైథిలీ ఠాకూర్ స్పందించారు. నిత్యానంద్ రాయ్, వినోద్ తావ్డేలను కలిసే అవకాశం వచ్చిందని, బీహార్ భవిష్యత్తు గురించి చర్చించామని అన్నారు. ఎన్నికల్లో పోటీకి సంబంధించిన ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదని తెలిపారు. ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గం పట్ల ప్రత్యేక అనుబంధం ఉందని, అక్కడి నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications