వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరి, రాహుల్‌ నటుడా: విద్యార్థులకు పరేష్ రావల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

పుణే: పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు టీవీ నటుడు గజేంద్ర సింగ్ చౌహాన్‌ను చైర్మన్‌గా నియమించడం పట్ల కాంగ్రెస్, బిజెపిల మధ్య శుక్రవారం నాడు మాటల యుద్ధం సాగింది.

గజేంద్ర నియామకాన్ని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రశ్నించగా, ప్రముఖ నటుడు, బిజెపి నేత పరేష్ రావల్ కౌంటర్ ఇచ్చారు.

గజేంద్ర‌ను ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా నియమించడం పట్ల పలువురు విద్యార్థుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌టీఐఐ విద్యార్థులకు రాహుల్ గాంధీ మద్దతు పలికారు. ఇనిస్టిట్యూట్లో ఆయన విద్యార్థులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు.

FTII row: Paresh Rawal taunts 'actor' Rahul Gandhi

దీనిపై పరేష్ రావల్ స్పందించారు. జేంద్రను ఎఫ్‌టీఐఐకు చైర్మన్ గా నియమించడంపై రాహుల్ ఎలా స్పందించారన్నది తాను వినలేదని చెప్పారు. అయితే, దీంతో ఆయనకు ఓ అంశం దొరికిందని ఎద్దేవా చేశారు. దాంతో ఆయనను సంబరపడనిద్దామన్నారు.

గజేంద్ర సింగ్ చౌహాన్ విషయమై ఏమన్నారో తెలుసుకున్న తర్వాత మాట్లాడుతానని చెప్పారు. అయితే, ఇనిస్టిట్యూట్ విద్యార్థులను ఓ విషయం అడగదలుచుకున్నానని, గజేంద్ర సింగ్‌లో వారు రాజకీయ నాయకుడిని చూస్తే, రాహుల్ గాంధీలో నటుడిని చూశారా అని ప్రశ్నించారు.

English summary
BJP leader and actor Paresh Rawal on Friday took a jibe at Rahul Gandhi for politicising the appointment of Gajendra Chauhan as Film and Television Institute of India (FTII) chairman, saying the students must be seeing 'an actor' in the Congress vice-president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X