• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రోడ్లలో భారీ గుంతలు, ప్రధానికి లేఖ, అమ్మాయితో ఫోటోషూట్, వైరల్, షేమ్ షేమ్ !

|

బెంగళూరు: బెంగళూరు నగరంలోని రోడ్లపై పడిన గుంతలు పూడ్చడంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) అధికారులు నిర్లక్షం చెయ్యడంతో విసిగిపోయిన స్థానికులు, ప్రధాని కార్యాలయానికి లేఖ రాసినా ఫలితం లేకపోవడంతో సరికొత్తగా నిరసన వ్యక్తం చేశారు. అందమైన అమ్మాయిని రోడ్ల మీద పడిన గుంతల పక్కన నిలబెట్టి ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. బీబీఎంపీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేకు నెటిజన్లు చివాట్లు పెడుతున్నారు.

ఫ్రెండ్ భార్యకు మత్తు చాక్లెట్ లు ఇచ్చి నగ్నంగా వీడియోలు, బ్లాక్ మెయిల్, గ్యాంగ్ రేప్, సైకోలు!

 సోషల్ మీడియాలో ప్రచారం

సోషల్ మీడియాలో ప్రచారం

బీబీఎంపీ అధికారుల నిర్లక్షం గురించి, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోని విషయం గురించి ప్రతిఒక్కరికీ తెలియాలనే ఇలా ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని స్థానికులు అంటున్నారు. ఇకనైనా బీబీఎంపీ అధికారులు మా ప్రాంతంలోని రోడ్ల మీద పడిన గుంతులు పూడ్చి వెయ్యాలని స్థానికులు మనవి చేశారు.

 లెక్కలేనన్ని ఐటీ కంపెనీలు

లెక్కలేనన్ని ఐటీ కంపెనీలు

బెంగళూరు నగరంలోని బెళ్ళందూరు పరిసర ప్రాంతాల్లో ప్రసిద్ది చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలు, విలాసవంతమైన అపార్టుమెంట్లు ఉన్నాయి. బెళ్ళందూరు సమీపంలోని కసవనహళ్ళి పరిసర ప్రాంతాల్లోని లేఔట్ లో రోడ్ల మీద గుంతలు పడి స్థానికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీద ద్విచక్ర వాహనాలు నడపాలంటే భయంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రధాని మోదీకి లేఖ

ప్రధాని మోదీకి లేఖ

రోడ్ల మీద పడిన గుంతలను పూడ్చి వెయ్యాలని బీబీఎంపీ అధికారులకు అనేకసార్లు స్థానికులు మనవి చేశారు. బీబీఎంపీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రధాని కార్యాలయానికి తాము లేఖ రాశామని, మీరు స్థానిక నాయకులు, అధికారులకు సంప్రధించాలని ప్రధాని కార్యాలయం తమకు సమాధానం ఇచ్చిందని, అయినా ఫలితం లేదని స్థానికులు అంటున్నారు.

చేతికి చిక్కని ఎమ్మెల్యే

చేతికి చిక్కని ఎమ్మెల్యే

బెళ్ళందూరు ప్రాంతం మహదేవపుర శాసన సభ నియోజక వర్గం పరిధిలోకి వస్తుంది. స్థానిక శాసన సభ్యుడు (బీజేపీ), మాజీ మంత్రి అరవింద్ లింబావలి సైతం మాకు అందుబాటులో లేరని, ఆయన చేతికి చిక్కడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక లాభం లేదని స్థానికులు ఈ సరికొత్త ప్లాన్ వేశారు.

అమ్మాయి ఫోటోషూట్ అదుర్స్

అమ్మాయి ఫోటోషూట్ అదుర్స్

ఎమ్మెల్యే అరవింద లింబావలి, బీబీఎంపీ అధికారుల మీద అసహనం వ్యక్తం చేస్తున్న The Bellandur Development Forum సభ్యులు ఓ అందమైన అమ్మాయిని రోడ్ల మీద పడిన గుంతల పక్కన నిలబెట్టి ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో చివాట్లు

సోషల్ మీడియాలో చివాట్లు

ఇకనైనా బీబీఎంపీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే మా భాదలు గమనించి రోడ్ల మీద పడిన గుంతలను పూడ్చి వెయ్యాలని స్థానికులు మనవి చేశారు. స్థానికులు సరికొత్త పద్దతిలో నిరసన వ్యక్తం చేసిన విషయం సోషల్ మీడియాలో ద్వారా తెలుసుకున్న నెటిజన్లు బీబీఎంపీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేకి చివాట్లు పెడుతూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

English summary
Bengaluru: Funny Photoshoot made by The Bellandur Development Forum viral in social media. Many residents near Kasavanahalli Main Road in near Bellandur upset with pothole.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X