యువతిపై లైంగిక దాడి.. సిటీలో ఇవి మామూలేనన్న హోం మంత్రి

ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిటీల్లో ఇలాంటివి మామూలేనంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధిస్తున్న ఆకతాయిపై కఠిన చర్యలు తీసుకోకుండా.. హోం మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

G Parameshwara Sparks Outrage with Remarks on Sexual Assault Cases

ఇటీవల బెంగళూరులో ఓ యువతిపై అత్యాచారం చేసేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "బెంగళూరు వంటి పెద్దపెద్ద నగరాల్లోని వీధుల్లో మహిళలపై ఇటువంటి ఘటనలు సహజంగా జరుగుతుంటాయి. ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై ఇప్పటికే కమిషనర్‌తో మాట్లాడాను" అని హోం మంత్రి జి. పరమేశ్వర చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి.

ఏం జరిగింది..?

కర్ణాటకలోని సుద్దగుంటెపాలం ప్రాంతంలోని భారతీ లే అవుట్ లో ఏప్రిల్ 3న ఈ ఘటన జరిగింది. వీధిలో ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక వ్యక్తి ఒక్కసారిగా వెనకనుంచి వచ్చి వారిలో ఓ యువతిపై లైంగిక దాడి చేయబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో అక్కడినుంచి పారిపోయాడు. ఆ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక హోం మంత్రి స్పందించారు. ఇక ఈ ఘటనను సుమోటా తీసుకున్నారు బెంగళూరు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+