గాలి తమ్ముడికి గాలం వేసిన బీజేపీ, వదినతో ఒంటరిపోరాటం చేస్తున్న రెడ్డి, బళ్లారి కింగ్ ?

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి భగభగ మండిపోతోంది. మంగళవారం రాత్రి బీజేపీ హైకమాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది. కేఆర్ పీ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డికి బీజేపీ గాలం వేసింది.

గాలి సోమశేఖర్ రెడ్డి ప్రస్తుతం బళ్లారి బీజేపీ సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నుంచి బయటకు వచ్చి కర్ణాటక కల్యాణ ప్రగతి (కేఆర్ పీ) పార్టీని స్థాపించారు. గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీ పెట్టినా ఆయన సోదరులు గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి మాత్రం బీజేపీలోనే ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, మంత్రి బళ్లారి శ్రీరాములు కూడా బీజేపీలోనే ఉన్నారు.

 galibrothers-

మంగళవారం రాత్రి బీజేపీ హైకమాండ్ ప్రకటించిన మొదటి జాబితాలో బళ్లారి సిటీ నుంచి గాలి సోమశేఖర్ రెడ్డి, బళ్లారి గ్రామీణ నియోజక వర్గం నుంచి మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు పోటీ చేస్తారని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బళ్లారి సిటీ నుంచి గాలి సోమశేఖర్ రెడ్డి పోటీ చెయ్యడం ఖరారు కావడంతో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.

బళ్లారి సిటీ నుంచి తన భార్య గాలి లక్ష్మీ అరుణ కేఆర్ పీ పార్టీ నుంచి (ఫుల్ బాల్ సింబల్) పోటీ చేస్తారని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. బళ్లారి సిటీలో ఇప్పుడు వదిన లక్ష్మీ అరుణ , మరిది గాలి సోమశేఖర్ రెడ్డి రెండు వేర్వేరు పార్టీల నుంచి ప్రత్యక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బళ్లారి సిటీలో గాలి సోమశేఖర్ రెడ్డి వదినతో ఒంటరిపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యారు.

బళ్లారి సిటీ గాలి జనార్దన్ రెడ్డికి కంచుకోట. అలాంటి బళ్లారిలో ఒకే ఫ్యామిలీలో సొంత వదిన, మరిది పోటీ చెయ్యడంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. తన వదిన లక్ష్మీ అరుణ మీద తాను కచ్చితంగా విజయం సాధిస్తానని గాలి సోమశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తన తమ్ముడు అని కూడా చూడను, బళ్లారిలో మా పార్టీ కచ్చితంగా విజయం సాధించాలనే తన భార్య లక్ష్మీ అరుణ పోటీ చేస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి తెగేసి చెప్పారు.

 galibrothers-

మా అన్న గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టకూడదని నేను, నా సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి, మా మిత్రుడు మంత్రి బళ్లారి శ్రీరాములు ఎంత చెప్పినా ఆయన వినకుండా కొత్త పార్టీ పెట్టారని, మేము మాత్రం బీజేపీలోనే ఉంటామని అప్పుడే ఆయనకు తేల్చి చెప్పామని, బళ్లారిలో బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేస్తున్న తాను మరోసారి ఎమ్మెల్యే అవుతానని గాలి సోమశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

బళ్లారి సిటీ, బళ్లారి జిల్లాలో గాలి జనార్దన్ రెడ్డికి మంచి పలుకుబడి, పేరు, వేలాది మంది అభిమానులు, అనుచరులు ఉన్నారు. ఎలాగైనా తన తమ్ముడి మీద తన భార్య లక్ష్మీ అరుణ విజయం సాధించేలా చూడాలని ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి జిల్లా బయట నుంచి పావులు కదుపుతున్నారు. బళ్లారి సిటీలో ఒకే ఫ్యామిలీలో ఇద్దరు పోటీ పడటంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలీక గాలి ఫ్యామిలీ అనుచరులు అయోమయంలో పడిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+